Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : SonyLIV తన రాబోయే సిరీస్ రాకెట్ బాయ్స్ యొక్క ప్రీమియర్ కోసం సిద్ధమవుతున్నందున, కొంతమంది అసాధారణ వ్యక్తులను తెరపైకి తీసుకురావడంలో సహాయపడిన నటులపై అందరి దృష్టి ఉంది. డా. విక్రమ్ సారాభాయ్ మరియు డా. హోమీ జె. భాభా జీవితాలను ఫీచర్ చేస్తూ, భారతదేశ భవిష్యత్తును నిర్మిస్తూ చరిత్ర సృష్టించిన ఇద్దరు వ్యక్తుల అసాధారణ కథలను ఇది చెబుతుంది. ఇష్వాక్ సింగ్ డా. విక్రమ్ సారాభాయ్ పాత్రను పోషిస్తుండగా, జిమ్ సర్భ్ డా. హోమీ జె. భాభా పాత్రలో లీనమైపోయాడు. రెజీనా కసాండ్రా, సారాభాయ్ యొక్క బెటర్ హాఫ్, లెజెండరీ డాన్సర్ మృణాళిని సారాభాయ్ పాత్రను పోషిస్తూ, రాకెట్ బాయ్స్‌తో హిందీ OTT స్పేస్‌లో తన అరంగేట్రం చేసింది. దేశంలోని పశ్చిమ ప్రాంతాలతో డాక్టర్ సారాభాయ్‌కి ఉన్న అనుబంధానికి ప్రతీకగా ఈ సిరీస్‌లోని కొన్ని భాగాలు రాజస్థాన్‌లోని జైపూర్‌లో చిత్రీకరించబడ్డాయి. ఈ సిరీస్ అడ్డంకులతో నిండి ఉన్న అతని వ్యక్తిగత జీవితం, అతని మరింత మానవీయ గుణాలు అతని ప్రయాణాన్ని అస్తిత్వం వైపుకు ఎలా తీసుకువెళ్ళాయి వంటి వాటికి సంబంధించిన విషయాలను మనకు ప్రదర్శిస్తుంది. రెజీనా జైపూర్‌లో షూట్లను చాలా ఇష్టంగా గుర్తుచేసుకుంది, అక్కడ ఆమె సహనటులు ఆమెకు సౌకర్యంగా ఉండటానికి తమ తోడ్పాటునందించడంతో, ఇది నిజంగా ఆమె పనితీరు అద్భుతంగా రావడానికి సహాయపడింది. రెజీనా ఇలా అన్నారు, ''అత్యుత్తమ సహనటులతో పనిచేయడం నా అదృష్టం. ఇష్వాక్ మరియు జిమ్‌తో ఎప్పుడూ కూడా బోర్ గా ఫీలవలేదు. సెట్లో ఎప్పుడూ సరదాగా గడిపేవాళ్లం. చెప్పాలంటే, ఇష్వాక్ మరియు జిమ్ చాలా సీరియస్ నటులు, వారు నన్ను ఎప్పుడూ అప్రమత్తంగా, నా కాలి మీద నేను నిలబడేలా చేస్తారు. మరింత వివరిస్తూ, ఆమె ఇలా చెప్పింది, “నా సన్నివేశాలలో ఒకదాన్ని పూర్తి చేసిన తర్వాత, నేను డిన్నర్ టేబుల్ వద్ద ఇష్వాక్ నోట్స్ తయారు చేయడాన్ని చూశాను. నన్ను చూడగానే నోట్ బుక్ మూసేసాడు. ఇది నాకు ఆసక్తిని కలిగించింది. ప్రతి డైలాగ్‌కి నోట్స్ రాసుకుంటాడని తర్వాత తెలిసింది. అతను తన పాత్రలో చేస్తున్న పని నేను తగినంతగా చేస్తున్నానా అని నన్ను ప్రశ్నించేలా చేసింది. అతను తన పాత్రలకు ఎంత శ్రమ మరియు ఆలోచనలు పెడుతున్నాడో చూడటం మనోహరంగా ఉంది. ”
ఇష్వాక్ సింగ్‌కి ఇది కొత్తేమీ కాదు. నటుడు మాట్లాడుతూ, “నా కెరీర్ ప్రారంభం నుండి దీనిని నేను అనుసరిస్తూ వస్తున్నాను. నేను వ్రాసుకున్న పదాలు చాలా సహాయకరంగా ఉండేవి. వ్రాసిన పదాలు చదవడంలో గొప్ప ఆనందం ఉంది. నేను పాత్రలు మరియు వాటి డైలాగ్‌ల గురించి వ్రాసినప్పుడు, నేను బాగా గుర్తించగలను మరియు ఆ పాత్రలో లీనమవడంలో నాకు ఇది బాగా సహాయపడుతుంది. ఇది సన్నివేశాల మధ్య పాజ్లను నావిగేట్ చేయడంలో నాకు సహాయపడుతుంది. ఇది నాకు గుర్తుంచుకోవడానికి సహాయపడుతుంది. ”
నిఖిల్ అద్వానీ, రాయ్ కపూర్ ఫిల్మ్స్ మరియు ఎమ్మే ఎంటర్టైన్మెంట్ రూపొందించిన రాకెట్ బాయ్స్‌కి అభయ్ పన్ను దర్శకత్వం వహించారు మరియు సిద్ధార్థ్ రాయ్ కపూర్, మోనిషా అద్వానీ, మధు భోజ్వానీ మరియు నిక్కిల్ అద్వానీ నిర్మించారు. 8 ఎపిసోడ్లు గల ఈ సిరీస్ ఫిబ్రవరి 04న SonyLIVలో మాత్రమే ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.