Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మాత దిల్ రాజుకి చెందిన దిల్‌రాజు ప్రొడక్షన్ ఇప్పుడు డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టింది. దిల్ రాజు ప్రొడక్షన్స్, జీ5 కలయికలో రూపొందిన ఒరిజినల్ సిరీస్ 'ఎటీఎమ్' (ఎనీ టైమ్ మెమొరీ). శిరీష్ సమర్పణలో ఎస్.హరీష్ శంకర్, హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా రూపొందుతోంది.
ఈ వెబ్ సిరీస్ ఎనౌన్స్మెంట్ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీ 5 వైస్ ప్రెసిడెంట్ పద్మ మాట్లాడుతూ, 'మేం అసలు ఊహించని కాంబోతో వర్క్ చేశాం. తప్పకుండా స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే హాలీవుడ్ తరహాలో ఉంటుంది' అని తెలిపారు. 'కొత్త కాన్సెప్ట్‌తో హరీష్ శంకర్ మార్క్ ఎంటర్టైన్మెంట్తో ఈ వెబ్ సిరీస్ చేశాం' అని నిర్మాత దిల్‌రాజు చెప్పారు.