Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'గుడ్ లక్ సఖి'. స్పోర్ట్స్ రొమ్-కామ్‌గా రూపొందిన ఈ ఉమెన్ సెంట్రిక్ చిత్రంలో కీర్తి సురేష్ షూటర్‌గా కనిపించనున్నారు. ఆది పినిశెట్టి, జగపతి బాబు ప్రధాన పాత్రలు పోషించారు. సహ నిర్మాతగా శ్రావ్య వర్మ నేతత్వంలో ఎక్కువ మంది మహిళా టెక్నీషియన్స్‌తో ఈ సినిమాని తెలుగు, తమిళ, మలయాళ భాషలలో ఏకకాలంలో రూపొందించారు. నిర్మాత దిల్‌రాజు సమర్పణలో వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్ పై సుధీర్ చంద్ర పదిరి ఈ చిత్రాన్ని నిర్మించారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా నేడు (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది.
ఈ సందర్భంగా బుధవారం రాత్రి ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ముఖ్య అతిధిగా అగ్ర కథానాయకుడు రామ్ చరణ్ హాజరయ్యారు. రిపబ్లిక్ డే నేపథ్యంలో జరిగిన ఈ వేడుకలో చిత్రంలో సందర్భానుసారంగా వచ్చే 'ఎగిరే తిరంగ జెండాల తల ఎత్తి దించకుండా..' పాటతోపాటు బిగ్ టిక్కెట్‌నూ రామ్ చరణ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'యువ నిర్మాతలు శ్రావ్య, సుధీర్ ఈ స్థాయికి చేరడం మామూలు విషయం కాదు. యంగ్ టెక్నికల్ టీమ్ పనిచేశారు. నగేష్ నేషనల్ అవార్డు విన్నర్. కెమెరామెన్, కీర్తి ఇలా ఇంతమంది కలిసి పనిచేయడం మామూలు విషయం కాదు. అందుకే వీరి కలయిలో సినిమా బాగుంటుంది. ఇంత మంది దిగ్గజాలు చేసిన ఈ సినిమా చాలా మీనింగ్ ఫుల్‌గా ఉంటుందనిపిస్తోంది. అందరికీ లైట్హౌస్గా దేవీశ్రీప్రసాద్ వున్నారు. సినిమా పరిశ్రమలో ఆడవాళ్ళు, మగవాళ్ళు అనే తేడాలేదు. ఇప్పుడు ఏ బోర్డర్ లేకుండా ఇండియన్ సినిమా అని రాజమౌళిగారి వల్ల తెలుగు సినిమా పేరు తెచ్చుకుంది' అని చెప్పారు.
'కథగా చెప్పాలంటే పల్లెటూరిలో బంజార అమ్మాయి ఎలా షూటర్‌గా ఎదిగింది అనేది పాయింట్. ఈ సినిమా కె.విశ్వనాథ్, జంథ్యాల చిత్రాల స్పూర్తిగా తీసుకున్నట్లుగా ఉంటుంది' అని దర్శకుడు నగేష్ కుకునూర్ అన్నారు.