Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ ధనలక్ష్మి మూవీస్ పతాంకపై ఎమ్.వినరుబాబు దర్శకత్వంలో చందర్ గౌడ్ నిర్మిస్తున్న చిత్రం 'సీతారామపురంలో ఒక ప్రేమ జంట. విలేజ్ బ్యాక్ డ్రాప్లో నడిచే ఈ ప్రేమకథా చిత్రంతో రణధీర్ హీరోగా, నందిని రెడ్డి హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లోని భూత్ బంగ్లాలో జరుగుతోంది.
ఈ సందర్భంగా ఆన్ లొకేషన్లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు వినరు బాబు మాట్లాడుతూ, 'నేటితో (శుక్రవారం)తో షూటింగ్ పూర్తవు తుంది. సినిమా అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం వస్తోన్న ప్రేమకథా చిత్రాల కంటే ఎంతో విభిన్నంగా ఈ చిత్రం ఉంటుంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరి. ప్రేమలో ఉన్న ప్రతి జంట చూడాల్సిన చిత్రం. అలాగే తల్లిదండ్రులకు కూడా మంచి సందేశం ఇస్తున్నాం. హీరోగా రణధీర్‌కి ఫస్ట్ సినిమా అయినా ఎంతో అనుభవం ఉన్న హీరోలా ఫైట్స్, డాన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ చేశాడు. అలాగే హీరోయిన్గా నందిని రెడ్డికి కూడా తొలి చిత్రమే అయినప్పటికీ క్లైమాక్స్‌లో వచ్చే ఫైట్‌లో విజయశాంతిలా అద్భుతమైన నటన కనబరిచింది. మా నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా మంచి అవుట్ పుట్ రావడానికి సహకరించారు. అలాగే సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరెక్టర్‌తో పాటు మా టెక్నికల్ టీమ్ కూడా బాగా సపోర్ట్ చేశారు. ఇటీవల మంత్రి తలసాని లాంచ్ చేసిన ఫస్ట్ సింగిల్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలో మరో సాంగ్‌ని రిలీజ్ చేస్తాం' అని తెలిపారు.
'దర్శకుడు వినరు బాబు చెప్పిన కథ నచ్చి, మా అబ్బాయి రణధీర్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమా నిర్మించాను. కథకు తగ్గట్టుగా కాంప్రమైజ్ కాకుండా ఖర్చు పెట్టాం. ఆంధ్రప్రదేశ్, భద్రాచలం, చిక్ మంగ్ళూర్, బెంగళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. కథలో మంచి మలుపులు ఉన్నాయి. హీరోగా పరిచయం అవుతున్న మా అబ్బాయి రణధీర్‌ని ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నా. సినిమాని కూడా మార్చిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం' అని నిర్మాత చందర్‌గౌడ్ చెప్పారు.
హీరో రణధీర్ మాట్లాడుతూ,'హీరోగా ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన మా దర్శకుడు వినరు బాబు గారికి ధన్యవాదాలు. సీనియర్ సినిమాటోగ్రాఫర్ విజరు కుమార్ గారి ఇచ్చిన సలహాలు, సూచనలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. మ్యూజిక్ కూడా సినిమాకి మంచి ప్లస్ అవుతుంది' అని అన్నారు. హీరోయిన్ నందిని రెడ్డి, సంగీత దర్శకుడు ఎస్.ఎస్.నివాస్, నటుడు భాషా ఈ సమావేశంలో పాల్గొని మరిన్ని చిత్ర విశేషాలను తెలిపారు.