Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా 'కొండా'. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. కొండా మురళి పాత్రలో త్రిగుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించారు. శ్రేష్ఠ పటేల్ మూవీస్ సమర్పణలో ఆపిల్ ట్రీ, ఆర్జీవీ ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మించాయి. హనుమకొండలోని కొండా క్యాంపు ఆఫీసులో బుధవారం ఈ చిత్ర ట్రైలర్ను విడుదల చేశారు.
'సరిగ్గా 30 ఏళ్ల క్రితం జనవరి 26న, 10.25 గంటలకు కొండా మురళిని షూట్ చేసి చంపడానికి ట్రై చేశారు. అందుకని అదే సమయానికి ట్రైలర్ రిలీజ్ చేశాం. 'కొండా 2'లో మురళి, సురేఖ దంపతుల కుమార్తె సుష్మిత పాత్ర ఉంటుంది. మురళి అన్న చేసిన రిస్క్ వల్ల... నా కెరీర్లో డిఫరెంట్, గుడ్ సినిమా తీశానని నమ్మకం ఉంది. మార్చిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని రామ్గోపాల్ వర్మ చెప్పారు. కొండా మురళి మాట్లాడుతూ, 'ఇదే జనవరి 26న నా మీద 47 బుల్లెట్లు ఫైరింగ్ చేశారు. అయినా బతికాను. అది కూడా మా కుటుంబం కోసం కాదు, ప్రజల కోసం. సినిమా గురించి చెప్పడం కన్నా చూస్తే బాగుంటుంది' అని తెలిపారు. 'ట్రైలర్ చూశాక మేం ఎంత బాధ అనుభవించామనేది గుర్తొచ్చింది. భావోద్వేగానికి లోనయ్యా' అని కొండా సురేఖ చెప్పారు.