Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ హీరోగా నటిస్తున్న 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రంతో శరత్ మండవ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని ఓ పాటను రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరిస్తున్నారు. గురువారం హీరో రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ఓ స్పెషల్ పోస్టర్ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ పోస్టర్లో రవితేజ భిన్న ఎమోషన్స్‌తో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే ఎమోషన్స్ ఉన్నట్టు ఈ పోస్టర్ ద్వారా తెలుస్తోంది. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో వేణు తొట్టెంపూడి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 25న విడుదల చేయాలని చిత్రయూనిట్ నిర్ణయించింది.
నాజర్, నరేష్, పవిత్రా లోకేష్, సార్పట్టా జాన్ విజరు, చైతన్య కష్ణ, తణికెళ్ల భరణి, రాహుల్ రామకష్ణ, ఈరోజుల్లో శ్రీ, మధుసూదన్ రావు, సురేఖా వాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: శ్యామ్ సీఎస్, సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్ ఐఎస్సీ, ఎడిటర్: ప్రవీణ్ కేఎల్, ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్.