Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్ యడ్లపల్లి, స్వాతి, యశ్వంత్ పెండ్యాల, సిద్దార్థ్ గొల్లపూడి, మానిక్ రెడ్డి ముఖ్య తారాగణంగా నటించిన చిత్రం 'స్వ'. జి.ఎం.ఎస్ గాలరీ ఫిల్మ్స్ పతాకంపై మను పి.వి దర్శకత్వంలో జి.ఎం సురేష్ నిర్మించారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా నిర్మాత జి.ఎం.సురేష్ మాట్లాడుతూ,' ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే 'కన్నుల్లోన..' పాట కూడా ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. వినోద్ శర్మ, నాదప్రియ పాడిన ఈ పాటను కరణం శ్రీ రాఘవేంద్ర రచించి, స్వరపరిచారు. అందర్నీ మెప్పించే కంటెంట్ ఉన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఇటీవలే మా చిత్రం సెన్సార్ పనులు పూర్తి చేసుకుని, సెన్సార్ బోర్డ్ వారి నుంచి మంచి అభినందనలూ అందుకుంది. ఫిబ్రవరి 4వ మా చిత్రాన్ని గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఓ మంచి ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రం కచ్చితంగా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం' అని తెలిపారు.