Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాగిణి ద్వివేది, మేఘన రాజ్ ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం 'రియల్ దండుపాళ్యం'. రామానాయక్ సమర్పణలో శ్రీ వైష్ణో దేవి పతాకంపై మహేష్ దర్శకత్వంలో సి.పుట్టస్వామి నిర్మించారు.
ఈ సినిమా విడుదలకు సిద్ధమైన సందర్భంగా శుక్రవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో నిర్మాత సి.పుట్టస్వామి మాట్లాడుతూ, ''దండుపాళ్యం' సిరీస్‌కి మించేలా ఈ సినిమా విజయం సాధిస్తుంది. మగాళ్ళ వంచనకు గురైన ఐదుగురు అమ్మాయిల కథే ఈ సినిమా. ప్రతి సన్నివేశాన్ని ఎంతో రియలిస్టిక్‌గా దర్శకుడు మహేష్ తెరకెక్కించారు. ఫిబ్రవరి 4న సినిమాను వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం' అని చెప్పారు. 'ఈ చిత్రాన్ని ఎంతో ఛాలెంజింగ్‌గా తీసుకుని చేశాను. సినిమా మొత్తం అత్యంత సహజంగా ఉంటుంది' అని నాయిక రాగిణి ద్వివేది తెలిపారు. తమపై జరుగుతున్న అకత్యాలను సమర్థవంతంగా మహిళలు ఎలా ఎదుర్కోవాలో ఈ సినిమాలో చూపించారు. ప్రతి మహిళ చూడాల్సిన సందేశాత్మక చిత్రమిదని 13 ఏళ్ల వయసులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి, వరల్డ్ రికార్డ్ సష్టించిన మాలోవత్ పూర్ణ అన్నారు.