Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంజయ్ లీలా భన్సాలీ, అలియాభట్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'గంగూబాయి కథియావాడి'. పెన్ స్టూడియోస్, భన్సాలీ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాయి.
తాజాగా ఈ చిత్ర విడుదల తేదీని మేకర్స్ శుక్రవారం ప్రకటించారు. 'ఫిబ్రవరి 25న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నాం. అంతేకాకుండా 72వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో కూడా మా చిత్రాన్ని ప్రదర్శించబోతున్నాం' అని మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఎనౌన్స్మెంట్ చేశారు.
గంగూబాయి కథియావాడిగా అలియాభట్ నటించగా, ఓ కీలక పాత్రని అజరు దేవగణ్ పోషించారు. సంజయ్ లీలా భన్సాలీ, డా. జయంతిలాల్ గడ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో విడుదలై ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినివ్వనుంది.