Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మా ఆశిష్‌ని హీరోగా పరిచయం చేస్తూ మేం నిర్మించిన 'రౌడీబార్సు' సినిమా ప్రేక్షకుల ఆదరణతో మంచి విజయాన్ని సాధించింది. మేం ఊహించి నట్టుగానే భారీ గ్రాస్ ఈ సినిమా సొంతం చేసుకోవటం చాలా ఆనందంగా ఉంది' అని నిర్మాత దిల్‌రాజు అన్నారు.
'రౌడీబార్సు' సాధించిన విజయంతోపాటు ప్రస్తుత ఉన్న కరోనా థర్డ్‌వేవ్ పరిస్థితుల్లో పెద్ద సినిమాల విడుదల గురించి శనివారం ఆయన మీడియాతో సంభాషించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'మా 'రౌడీబార్సు' సినిమాని ఆదరించిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. విడుదల రోజు కలెక్షన్లు నిరుత్సాహ పరిచాయి. అయితే యూత్‌కి ఈ సినిమా బాగా కనెక్ట్ కావడంతో మరుసటి రోజు నుంచి రెండోవారం వరకు విజయవంతంగా ప్రదర్శితమై 13.5 కోట్ల గ్రాస్‌ని రాబట్టింది. మూడోవారంలో కచ్చితంగా మరో రెండు కోట్ల గ్రాస్‌ని కచ్చితంగా కలెక్ట్ చేస్తుందని ఆశిస్తున్నాం. యూత్‌ని ఈ సినిమాని బాగా ఓన్ చేసుకోవడంతో మేం ఊహించిన మ్యాజికల్ ఫిగర్ 15 కోట్ల గ్రాస్‌ని రీచ్ అయ్యాం. కరోనా పరిస్థితులు, మరో పక్క 'బంగార్రాజు'లాంటి పెద్ద సినిమా ఉన్నప్పటికీ కొత్త హీరో సినిమాకి ఈ స్థాయి కలెక్షన్లు రావడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా సూపర్‌హిట్టే అయినా ఆశిష్ మాత్రం ఇంకా నటుడే. తను హీరో అని నిరూపించుకోవడానికి చాలా జర్నీ చేయాలి. ఫిబ్రవరి 25 నుంచి పెద్ద సినిమాలు కచ్చితంగా విడుదలవుతాయనే నమ్మకంతో ఉన్నాం. ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలల్లో 'ఆర్ఆర్ఆర్', 'రాధేశ్యామ్', 'ఆచార్య', 'భీమ్లానాయక్', 'సర్కారువారి పాట' సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఏపీలో టిక్కెట్ల ధర విషయంలో సానుకూల స్పందన వస్తుందని ఆశిస్తున్నాం' అని తెలిపారు.