Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామానుజం జీవిత చరిత్ర ఆధారంగా లయన్ సాయి వెంకట్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'జయహో రామానుజ'. సుదర్శనం హేమలత సమర్పణలో సుదర్శనం ప్రొడక్షన్స్ పతాకంపై సుదర్శనం సాయి ప్రసన్న, సుదర్శనం ప్రవళీకలు నిర్మిస్తున్నారు.
ఈచిత్ర టైటిల్ లోగో లాంచ్ శనివారం ఫిల్మ్ ఛాంబర్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తిరుమలై కందాడై రామానుజ మఠం పీఠాధిపతి జగద్గురు శ్రీ శ్రీ శ్రీ లక్ష్మణాచార్యులు టైటిల్ లోగోను ఆవిష్కరించారు. కోదండ రామాచార్యులు (తిరుమలై కందాడై రామానుజ మఠం ఉత్తర పీఠాధిపతి), టి.ఎఫ్‌్.పి.సి ప్రధాన కార్యదర్శి మోహన్ వడ్ల పట్ల తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, నటుడు సాయి వెంకట్ మాట్లాడుతూ, 'వైష్ణవ ఉద్దాపకుడు, జననాయకుడు, వైష్ణవ తత్వాన్ని క్రియేట్ చేసిన విశిష్ట సిద్ధాంత వ్యవస్థాపకుడు భగవత్ రామానుజాచారి చరిత్ర తీయాలంటే అంత ఈజీ కాదు. ఈ సినిమా తీస్తున్నప్పుడు చిన్న జీయర్స్వామితోపాటు పలువరు పీఠాధిపతులను కలిసి మరిన్ని వివరాలను సేకరించాను. సబ్జెక్ట్ పెద్దది కావడంతో దీన్ని రెండు పార్ట్‌లుగా చేస్తున్నాం. తొలుత పార్ట్1ను రిలీజ్ చేస్తాం. 5 నెలల తర్వాత రెండవ భాగాన్ని విడుదల చేస్తాం. ఇప్పటి వరకు 25% వరకు షూటింగ్ పూర్తయ్యింది. ఇందులో ఆరు పాటలు, 11 శ్లోకాలు ఉంటాయి. నా ముగ్గురు కూతుర్లలో ఇద్దరమ్మాయిలు నిర్మాతలుగా బాధ్యతలు వ్యవహరిస్తున్నారు. మూడో అమ్మాయి పద్మను సింగర్‌గా ఈ సినిమా ద్వారా పరిచయం చేయబోతున్నాం' అని చెప్పారు.