Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ధనుంజయ్, అమృత అయ్యంగార్ జంటగా నటించిన కన్నడ చిత్రం 'బడవ రాస్కెల్'. విశేష ప్రేక్షకాదరణతో కన్నడనాట సంచలన విజయం సాధించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
డాలీ పిక్చర్స్, రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. తెలుగులో పలు విజయ వంతమైన సినిమాలను నిర్మించి, మంచి గుర్తింపు సంపాదించుకున్న రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ ఈ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని అందిస్తుండడం విశేషం.
'తెలుగులో భారీ విజయం సొంతం చేసుకున్న 'పుష్ప సినిమాలో జాలిరెడ్డి పాత్రతో ప్రేక్షకులను అలరించిన ధనుంజరు ఈ సినిమాలో హీరోగా, అమత అయ్యంగార్ హీరోయిన్గా ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తారు. శ్రీమతి గీత శివరాజ్ కుమార్ సమర్పణలో శ్రీమతి సావిత్రమ్మ అడవి స్వామి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని శంకర్ గురు దర్శకత్వంలో నిర్మించారు. కన్నడలో మాదిరిగానే తెలుగులోనూ ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం' అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి నిర్వాణం సారధ్యం : రిజ్వాన్, కో ప్రొడ్యూసర్ : ఖుషి, సినిమాటోగ్రఫీ : ప్రీతా జయరామన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రమణారెడ్డి, దేవన్ గౌడ, ఎడిటింగ్ : నిరంజన్ దేవర మని, ఫైట్స్ : వినోద్, మాటలు - సాహిత్యం : రామ్ వంశీకష్ణ, కొరియోగ్రఫీ : తగరు రాజు.