Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపీచంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'పక్కా కమర్షియల్'. యూవీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలోని ఫస్ట్ సింగిల్ ఫిబ్రవరి 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మారుతి ఈ పాట విశేషాలను, ఈ పాట రాసిన సిరివెన్నెల గురించి మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
''జన్మించినా మరణించినా ఖర్చే ఖర్చు.. జీవించడం అడుగడుగునా ఖర్చే ఖర్చు' అంటూ సిరివెన్నెల సీతారామ శాస్త్రిగారి కలం నుంచి జాలువారిన స్ఫూర్తిదాయక పాట ఇది. ఆయన చివరిసారి రాసిన ఈ పాటలో జీవిత సారాంశం ఉంది. పైగా మరణం గురించి ముందే తెలిసినట్టు ఆయన కొన్ని పదాలు ఈ పాటలో సమకూర్చారు. ఈ పాటలో ఇంకా ఎన్నో అద్భుతమైన పదాలు ఉన్నాయి. జీవితం గురించి, పుట్టుక, చావు గురించి అద్భుతమైన సాహిత్యం ఈ చిత్ర టైటిల్ సాంగ్లో ఉంటాయి' అని దర్శకుడు మారుతి తెలిపారు.
గోపీచంద్, రాశీఖన్నా, సత్యరాజ్, రావు రమేశ్, సప్తగిరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పణ - అల్లు అరవింద్, నిర్మాత - బన్నీ వాసు, ప్రొడక్షన్ డిజైనర్ - రవీందర్, మ్యూజిక్ - జేక్స్ బీజారు, సహ నిర్మాత - ఎస్కెఎన్, లైన్ ప్రొడ్యూసర్ - బాబు, ఎడిటింగ్ - ఎన్.పి . ఉద్భవ్, సినిమాటోగ్రఫి - కరమ్ చావ్ల, దర్శకుడు - మారుతి.