Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వెంకటేష్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం 'ఎఫ్ 3'. అనిల్ రావిపూడి దర్శకుడు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పై శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ పూర్తయింది. ఒక సాంగ్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. అలాగే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి, వేసవి కానుకగా ఈ చిత్రాన్ని ఏప్రిల్ 28న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
'ట్రేడ్ వర్గాల్లో ఉన్న క్రేజ్, సినిమాకి వస్తున్న పాజిటివ్ వైబ్స్ దష్ట్యా ఈ సినిమాతో వేసవికి మూడు రెట్లు వినోదాన్ని అందించబోతున్నారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్ వంటి వారితో ఈ సినిమా మరింత వినోదాత్మకంగా మారనుంది. తమన్నా, మెహరీన్‌లు నవ్వించడమే కాకుండా, తమ అందంతో కట్టిపడేసేందుకు రెడీ అవుతున్నారు. మరింత గ్లామర్‌ని జత చేస్తూ సోనాల్ చౌహాన్ కూడా ఎంట్రీ ఇచ్చారు. మూడో హీరోయిన్గా ఆమె ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయనున్నారు. వినోదం, గ్లామర్ ఇలా అన్ని రకాల కమర్షియల్ హంగులతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఈ సినిమా కోసం సూపర్ హిట్ ఆల్బమ్ రెడీ చేశారు' అని చిత్ర యూనిట్ పేర్కొంది.