Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమిళ స్టార్ హీరో విశాల్ నటించిన నూతన చిత్రం 'సామాన్యుడు'. ఓ యూనిక్ కంటెంట్తోయాక్షన్ డ్రామా చిత్రంగా దీన్ని డెబ్యూ డైరెక్టర్ తు.ప. శరవణన్ రూపొందించారు. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై విశాల్ నిర్మించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'ఫిబ్రవరి 4న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమా ఫుల్ యాక్షన్ మోడ్‌లో ఉండబోతోందని ఇటీవల విడుదల చేసిన టీజర్, ట్రైలర్ చెప్పకనే చెప్పాయి. అలాగే సెకండ్ సాంగ్ 'మత్తెక్కించే'కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. విశాల్ సరసన డింపుల్ హయతి నాయికగా నటించారు. కెవిన్‌రాజ్ సినిమాటోగ్రఫీ, యువన్ శంకర్ రాజా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను టెక్నికల్‌గా స్ట్రాంగ్‌గా మార్చేశాయి. విశాల్ నుంచి రాబోతున్న మరో అరుదైన చిత్రమిది. కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం' అని చెప్పారు.
యోగిబాబు, బాబురాజ్ జాకబ్, పా తులసి, రవీనా రవి ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఎడిటర్ : ఎన్ బి శ్రీకాంత్, ఆర్ట్ : ఎస్ఎస్ మూర్తి.