Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీకాంత్ హీరోగా సుధీర్ రాజు దర్శకత్వంలో రాబోతున్న చిత్రం 'కోతల రాయుడు'. 'కష్ణాష్టమి' ఫేం డింపుల్ చోపడే, 'జై సింహ' ఫేం నటషా దోషి హీరోయిన్స్‌గా నటించారు. పధ్వీ, మురళి శర్మ, సత్యం రాజేష్, పోసాని కష్ణమురళి, సుడిగాలి సుధీర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఆస్క్ ఫ˜ిలిమ్స్ బ్యానర్‌పై రూపొందింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా నిర్మాతలు ఎ.ఎస్.కిషోర్, కొలన్ వెంకటేష్ మాట్లాడుతూ, 'మంచి సినిమా ఎప్పుడొచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారని ఎన్నోసార్లు నిరూపించారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే విధంగా రూపొందిన మా 'కోతలరాయుడు' చిత్రాన్ని సైతం ప్రేక్షకులు హిట్ చేస్తారని ఆశిస్తున్నాం. మా అందరికీ మంచి పేరు తీసుకొచ్చే ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న భారీ స్థాయిలో థియేటర్లలో రిలీజ్ చేస్తున్నాం' అని తెలిపారు.
'ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో కామెడీ, ఫైట్స్ బాగున్నాయి. ఫ్యామిలీలో ఉన్న అందరూ కలిసి చూడదగ్గ అంశాలు ఉన్నాయి. శ్రీకాంత్ పాత్ర అందరికీ కనెక్ట్ అవుతుంది' అని దర్శకుడు సుధీర్ రాజు చెప్పారు.