Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శివ కంఠమనేని హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ''మధురపూడి గ్రామం అనే నేను''. జి రాంబాబు యాదవ్ సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యాజిక్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కేఎస్.శంకర్రావు, ఆర్.వెంకటేశ్వరరావు నిర్మాతలు.
మల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లిరికల్ సాంగ్ 'వెల్లే గోరిక'ను యువ కథానాయకుడు ఆకాష్ పూరి విడుదల చేసి, పాట చాలా బాగుందంటూ హీరో శివ కంఠమనేని, చిత్ర బందానికి అభినందనలు తెలిపారు.
''వెల్లే గోరింక మళ్లీ రావే నా వంక...నన్నే నేను మరిసిపోయా నిన్నే చూశాక...చాల్లే చాలింక ఈ అల్లరి ఎందాకా ..పోతా ఉంటే రారా..' అంటూ సాగే ఈ పాటకు మణిశర్మ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. శ్రీమణి సాహిత్యాన్ని అందించగా, ధనుంజరు, సాహితీ ఆలపించారు. ఈ పాటకు సోషల్ మీడియాలోనే కాకుండా సినీ పరిశ్రమలోనూ మంచి రెస్పాన్స్ లభించడంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు' అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి సహ నిర్మాతలు - కె శ్రీధర్ రెడ్డి, ఎం జగ్గరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్ - కె శ్రీనివాసరావు, వై అనిల్ కుమార్, సంగీతం - మణిశర్మ, సినిమాటోగ్రఫీ - సురేష్ భార్గవ్, ఎడిటర్ - గౌతమ్ రాజు, ఫైట్స్ - రామకష్ణ, మాటలు - ఉదరు కిరణ్, సమర్పణ - జి రాంబాబు యాదవ్, నిర్మాతలు - కేఎస్ శంకర్ రావు, ఆర్ వెంకటేశ్వరరావు, రచన - దర్శకత్వం :మల్లి.