Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చారు బిస్కెట్ నుంచి గత ఏడాది లాక్డౌన్లో విడుదలైన వెబ్ సిరీస్ '30 వెడ్స్ 21'. ఈ వెబ్ సిరీస్ అన్ని రకాల రికార్డులను బ్రేక్ చేసి, న్యూ ఏజ్ గ్యాప్ లవ్ స్టోరీగా నిలిచింది. ఈ ఫ్రెష్ కాన్సెప్ట్‌తో వచ్చిన వెబ్ సిరీస్ అందరినీ విశేషంగా అలరించింది. చైతన్య, అనన్య జోడికి యూట్యూబ్‌లో రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఈ వెబ్ సిరీస్ అభిమానులను ఓ గుడ్ న్యూస్‌తో చారు బిస్కెట్ సంస్థ సర్ప్రైజ్ చేసింది.
త్వరలోనే ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అసమర్థుడు, మనోజ్ పీ సంయుక్తంగా రెండో సీజన్ కాన్సెప్ట్‌ను రాయగా, పథ్వీ వనం దర్శకత్వం వహించారు. నేడు (సోమవారం) ఈ రెండో సిరీస్ టీజర్‌ని మేకర్స్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆదివారం ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు. నాయకానాయికలు చైతన్య, అనన్య ఇద్దరూ ఈ పోస్టర్లో రొమాంటిక్‌గా కనిపిస్తున్నారు. పోస్టర్‌తోనే రెండో సీజన్ మీద పాజిటివ్ వైబ్స్‌ను మేకర్స్ క్రియేట్ చేశారు. మహేందర్, దివ్య, వీరభద్రం, శ్రీ కుమారి తదితరులు నటించిన ఈ రెండవ వెబ్ సిరీస్‌కి రచయితలు : అసమర్థుడు, మనోజ్.పి, సినిమాటోగ్రఫీ : ప్రత్యక్ష్ రాజు, ఎడిటింగ్ - డిజైనింగ్ : తారక్ సాయి ప్రతీక్, మ్యూజిక్ : జోస్ జిమ్మి.