Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రిత్విక్ చిల్లికేశల, చిత్రా శుక్లా హీరో, హీరోయిన్లుగా పి. నానిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'కళింగపట్నం జీవా'. డీఎల్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హీరో రిత్విక్ చిల్లికేశల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం నిర్వహించిన వేడుకలో నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.
ఈ సందర్భంగా హీరో, నిర్మాత రిత్విక్ మాట్లాడుతూ, 'నేను బేసిగ్గా డ్యాన్సర్‌ని. కానీ ఇందులో ఒక్క పాట కూడా లేదు. ఈ సినిమాని నిర్మిస్తూనే కథ అందించడంతోపాటు రీ రికార్డింగ్ వర్క్ కూడా నేనే చేశాను. సినిమా చాలా బాగా వచ్చింది. ప్రస్తుతం షూటింగ్, ఎడిటింగ్ పూర్తయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఇంకో 20 రోజుల్లో ఫస్ట్ కాపీ రెడీ అవుతుంది. వైవిధ్యంగా ఉండే ఈ చిత్రంలో హీరోకి ఒక కన్ను మాత్రమే కనిపిస్తుంది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చే చిత్రమిది' అని చెప్పారు.