Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వ కార్తికేయ హీరోగా, సీనియర్ నటి ఆమని మేనకోడలు హ్రితిక శ్రీనివాసన్ హీరోయిన్గా తెరకెక్కుతున్న చిత్రం 'అల్లంత దూరాన'. చలపతి పువ్వల దర్శకుడు. ఆర్.ఆర్.క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై శ్రీమతి కోమలి సమర్పణలో ఎన్.చంద్రమోహనరెడ్డి తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా సోమవారం ప్రసాద్‌ల్యాబ్‌లో ఈ చిత్ర టీజర్‌ను అలీ ఆవిష్కరించారు. అలీ మాట్లాడుతూ, 'కథకు తగ్గట్టుగా ఆర్టిస్టులను ఎంపిక చేసుకుని ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో ఓ మంచి పాత్ర చేశాను' అని తెలిపారు.
చిత్ర దర్శకుడు చలపతి పువ్వల మాట్లాడుతూ, 'విజువల్ ఫీస్ట్‌గా ఈ సినిమా ఉంటుంది. ప్రతీ సన్నివేశం, ప్రతీ పాట ప్రేక్షకులను లీనమయ్యేలా చేస్తుంది' అని అన్నారు. 'మంచి కథ, కథనాలే ఈ చిత్రాన్ని తీసేందుకు నాకు స్ఫూర్తి కలిగించాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, మోషన్ పోస్టర్లకు మంచి స్పందన లభించిందని అన్నారు' అని నిర్మాత ఎన్. చంద్రమోహనరెడ్డి చెప్పారు.