Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి జంటగా, జ్ఞానసాగర్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ 'సెహరి'. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 11న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్లు సోమవారం మేకర్స్ ప్రకటించారు.
'ఈ సినిమా టైటిల్‌తో పాటు, టీజర్, సాంగ్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. హీరో హర్ష్ అదిరిపోయే స్టెప్పులతో 'సెహరి' టైటిల్ సాంగ్ యూత్‌ఫుల్ ట్రాక్‌గా నిలువగా, సెకండ్ సాంగ్ 'ఇది చాలా బాగుందిలే' పాటలో హర్ష్ తన అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్‌తో, తన అందమైన లుక్స్‌తో సిమ్రాన్ చౌదరి అదుర్స్ అనిపించారు. అన్ని రకాల కమర్షియల్ అంశాలతో యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని దర్శకుడు జ్ఞానశేఖర్ ద్వారక తెరకెక్కించారు. వర్గో పిక్చర్స్ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హీరో హర్ష్ కనుమిల్లి ఈ చిత్రానికి కథా రచయితగానూ వ్యవహరించారు. ప్రముఖ సంగీత దర్శకులు కోటి ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రని పోషిస్తున్నారు' అని చిత్ర బృందం చెప్పింది.