Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమిళ యువ కథానాయకుడు విష్ణు విశాల్ నటించిన డార్క్ యాక్షన్ థ్రిల్లర్ 'ఎఫ్ఐఆర్'. మను ఆనంద్ దర్శకుడు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది. అగ్ర కథానాయకుడు రవితేజ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. రెండు భాషల్లో ఫిబ్రవరి 11న ఈ సినిమాని విడుదల చేస్తున్నట్టు మేకర్స్ సోమవారం అధికారికంగా ప్రకటించారు.
'భయంకరమైన ఐస్ఐస్ ఉగ్రవాది అబూ బక్కర్ అబ్దుల్లా పరిశోధన ఆధారంగా సాధారణ జీవితాన్ని గడుపుతున్న ఇర్ఫాన్ అహ్మద్ అనే అమాయక యువకుడి జీవితంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి అనేది 'ఎఫ్ఐఆర్' మూలకథ. ఈ కథ చెన్నై, కొచ్చి, కోయంబత్తూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో జరుగుతుంది. ఈ సినిమా ప్లాట్ చాలా గమ్మత్తుగా ఉంటుంది. ప్రముఖ నటులు నటించిన ఈ చిత్రంపై అన్ని భాషల్లో మంచి బజ్ నెలకొని ఉంది. అగ్ర దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. మంజిమా మోహన్, రైజా విల్సన్, రెబా మోనికా జాన్, మాల పార్వతి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. రవితేజ సమర్పణలో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తుండడంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరిగాయి' అని చిత్ర యూనిట్ తెలిపింది.