Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లరి నరేష్, ఆనంది హీరో, హీరోయిన్లుగా జీ స్టూడియోస్ సమర్పణ, నిర్మాణంలో హాస్య మూవీస్ బ్యానర్‌పై ఓ సినిమా రూపొందనుంది. ఎ.ఆర్.మోహన్ దర్శకత్వంలో రాజేష్ దండ నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. బాలాజీ గుత్త సహ నిర్మాత. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి షాట్‌కు బాలు మున్నంగి క్లాప్ కొట్టగా, అభిషేక్ అగర్వాల్ కెమెరా స్విచాన్ చేశారు. అనిల్ సుంకర గౌరవ దర్శకత్వం వహించారు. వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే తెలియజేయనున్నారు. అబ్బూరి రవి మాటలు అందిస్తున్న
ఈ చిత్రానికి సంగీతం : శీ చరణ్ పాకాల, సినిమాటోగ్రాఫర్ : రామ్ రెడ్డి, ఎడిటర్ : ఛోటా కె.ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్ : బ్రహ్మ కడలి, యాక్షన్ డైరెక్టర్ : వెంకట్, దర్శకత్వం : ఎ.ఆర్.మోహన్.