Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శర్వానంద్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. ఒక్క పాట మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాని ఫిబ్రవరి 25న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఈనెల 4వ తేదీ నుంచి ఆరంభించబోయే మ్యూజికల్ ప్రమోషన్స్‌లో తొలుత ఈ చిత్ర టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేయబోతోన్నారు. ఈనెల 4న సాయంత్రం 4:05లకు ఈ ఫస్ట్ సింగిల్‌ను విడుదల చేస్తున్నట్టు ఓ స్పెషల్ పోస్టర్ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో శర్వా స్టైలీష్ లుక్‌లో కనిపిస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో కుష్భూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఓ మంచి ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌గా ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఈ చిత్రాన్ని తనదైన శైలిలో దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కిస్తున్నారని చిత్ర బృందం తెలిపింది.