Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీవాసవి మూవీస్ పతాకంపై కె.హరనాథ్రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేస్తూ చోడవరపు వెంకటేశ్వరావు నిర్మాతగా అరంగేట్రం చేస్తున్న చిత్రం 'మాతదేవోభవ'. ఓ అమ్మ కథ అనేది ఉప శీర్షిక. వెయ్యి సినిమాలకు పైగా నటించిన సీనియర్ నటి సుధ తన కెరీర్లో తొలిసారి టైటిల్ రోల్ ప్లే చేస్తున్న చిత్రమిది. ఈ చిత్రం ద్వారా పతంజలి శ్రీనివాస్, అమతా చౌదరి హీరో హీరోయిన్లుగా పరిచయమవుతున్నారు.
మరుధూరి రాజా సంభాషణలు సమకూర్చిన ఈ చిత్రంలో సుమన్, రఘుబాబు, పోసాని, చమ్మక్ చంద్ర ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుధ మాట్లాడుతూ, ''ఇది నా సినిమా' అని గర్వంగా చెప్పుకునే సినిమా. ఫస్ట్ టైమ్ డైరెక్టర్ హరనాధ్ రెడ్డి, ఫస్ట్ టైమ్ ప్రొడ్యూసర్స్ చోడవరపు వెంకటేశ్వరావు-ఎమ్.ఎస్.రెడ్డికి చాలా మంచి పేరు తెస్తుంది. ప్రతి ఒక్కరూ మనసు పెట్టి పనిచేశారు. సకుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది' అని చెప్పారు. 'ఓ మంచి సినిమాతో నిర్మాతలుగా పరిచయం కావడం అదష్టంగా భావిస్తున్నాం. సుధగారి కెరీర్లో ఈ చిత్రం ఓ కలికితురాయిగా నిలుస్తుంది. ఈనెల 18న ప్రపంచవ్యాప్తంగా మా చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం' అని నిర్మాతలు చోడవరపు వెంకటేశ్వరావు-ఎమ్.ఎస్.రెడ్డి తెలిపారు. దర్శకుడు హరనాథ్ రెడ్డి మాట్లాడుతూ, 'ఇటువంటి సందేశాత్మక చిత్రంతో దర్శకుడిగా వెండితెరకు పరిచయం కావడం గర్వంగా ఉంది' అని చెప్పారు.