Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రచయిత, దర్శకుడు యండమూరి వీరేంద్రనాథ్
ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాధ్ తాజాగా దర్శకత్వం వహించిన వినూత్న కథా చిత్రం 'అతడు-ఆమె-ప్రియుడు'. సంధ్య మోషన్ పిక్చర్స్ ప్రయివేట్ లిమిటెడ్ పతాకంపై సునీల్, బిగ్ బాస్ ఫేమ్ కౌశల్, బెనర్జీ ముఖ్య పాత్రల్లో నటించారు. శ్రీమతి కూనం కష్ణకుమారి సమర్పణలో రవి కనగాల, రామ్ తుమ్మలపల్లి సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విభిన్న కథా చిత్రమిది. ఈనెల 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా కోసం బిగ్ బాస్ విన్నర్ కౌశల్ చెప్పిన అద్భుతమైన సింగిల్ టేక్ డైలాగ్ టీజర్‌ను బుధవారం చిత్ర దర్శకులు యండమూరి వీరేంద్రనాధ్ విడుదల చేశారు. స్త్రీ ఔన్నత్యం గురించి యండమూరి అత్యద్భుతంగా రాసిన రెండు పేజీల డైలాగ్‌ను కౌశల్ అంతే అద్భుతంగా, సింగిల్ టేక్‌లో చెప్పి ఆశ్చర్యపరిచారు. అందుకే ఈ డైలాగ్ టీజర్‌ను రచయిత-దర్శకుడు యండమూరి ప్రత్యేకంగా విడుదల చేశారని మేకర్స్ తెలిపారు. నటుడిగా కౌశల్‌కు ఉజ్వల భవిష్యత్ ఉందని, ఆయన చెప్పిన సింగిల్ టేక్ డైలాగ్ అదుర్స్ అంటూ యండమూరి ఆయన్ని ప్రశంసలతో ముంచెత్తారు. ఈ చిత్రానికి కెమెరా- కూర్పు: మీర్, నిర్మాణ సారధ్యం: అమర్, సమర్పణ: శ్రీమతి కూనం కష్ణకుమారి, నిర్మాతలు: రవి కనగాల-రామ్ తుమ్మలపల్లి, కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: యండమూరి వీరేంద్రనాథ్.