Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిద్ధు జొన్నలగడ్డ, నేహాశెట్టి హీరో,హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా 'డిజె టిల్లు', సితార ఎంటర్టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థతో కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. విమల్ కష్ణ దర్శకుడు. సూర్యదేవర నాగవంశీ నిర్మాత. ఈ నెల 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని ఏఎంబీ మాల్లో బుధవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ, ''డిజె టిల్లు' యూత్ ఫుల్ సినిమా. కథ బాగా నచ్చడంతో కాంప్రమైజ్ కాకుండా నిర్మించాం. సినిమా ఫలితంపై మాకు చాలా నమ్మకం ఉంది. గ్యారెంటీగా విజయం సాధిస్తుంది' అని చెప్పారు. 'విమల్ కష్ణ, నేను డిస్కస్ చేసుకుని కథ, స్క్రీన్ ప్లే రాశాం. డైలాగ్స్ నేను రాశా. థియేటర్లో మీరు బాగా నవ్వుకుంటారు. డిజె టిల్లు పాత్రకు హద్దులు ఉండవు. ఏదైనా మాట్లాడుతాడు, ఏ సందర్భానైన్నా ఎదుర్కొంటాడు. హీరోయిన్ జీవితంలోకి డిజె టిల్లు లాంటి క్యారెక్టర్ వస్తే ఏం జరిగిందనేది సినిమా. యూత్‌కు రిలేట్ అయ్యేలా సినిమా తీశాం. త్రివిక్రమ్ గారు స్క్రిప్ట్ విషయంలో మంచి సలహాలు ఇచ్చి ప్రోత్సహించారు. నిర్మాత వంశీ మాకు పూర్తిగా సపోర్ట్ చేశారు' అని అన్నారు. దర్శకుడు విమల్ కష్ణ మాట్లాడుతూ, 'జనాల్ని నవ్వించాలనే మోటివ్తో ఈ సినిమా చేశాం. టీజర్ తర్వాత ఇప్పుడు ట్రైలర్ చూశారు. అవుట్ అండ్ అవుట్ ఫన్ మూవీ. ఆడియన్స్ అందరూ ఎంజారు చేస్తారు' అని తెలిపారు. 'ఇందులో రాధిక పాత్రలో నటించా. నేను కథ విన్నప్పుడు ఎంతగా ఎంజారు చేశానో, సినిమా చూస్తున్నప్పుడు మీరూ అంతే ఆస్వాదిస్తారు' అని కథానాయిక నేహా శెట్టి అన్నారు. ప్రిన్స్ మాట్లాడుతూ, 'ఇదొక ఫన్ ఫిల్మ్. వంశీ అన్నకు ముందే కంగ్రాట్స్ చెబుతున్నా. సిద్దు పెద్ద హిట్ కొడుతున్నాడు' అని చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: పి.డి.వి.ప్రసాద్.