Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బాహుబలి', 'రేసుగుర్రం', 'డీజే', 'మళ్ళీరావా' వంటి చిత్రాల్లో బాలనటుడిగా మెప్పించిన సాత్విక్ వర్మ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'బ్యాచ్'. బేబీ ఆరాధ్య సమర్పణలో ఆకాంక్ష మూవీ మేకర్స్ పతాకంపై సాత్విక్ వర్మ, నేహా పటాన్ జంటగా నటిస్తున్నారు. రఘు కుంచె సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ఈ నెల 11న గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ఈ చిత్రాన్ని రెండు పార్టులుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు శివ మాట్లాడుతూ, 'యూత్‌ని టార్గెట్ చేసి తీసిన చిత్రమిది. బెట్టింగ్, మేల్ ప్రాస్ట్యూషన్ నేపథ్యంతో సాగే కథ' అని తెలిపారు. 'ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి బిజినెస్ చేసుకున్న మా చిత్రం 100% హిట్టవుతుందనే నమ్మకం ఉంది' అని చిత్ర నిర్మాత రమేష్ గనమజ్జి చెప్పారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు : సత్తిబాబు కసిరెడ్డి, అప్పారావు పంచాది, సంగీతం : రఘు కుంచె, డిఓపి : వెంకట్ మన్నం, ఎడిటర్ : జెపి, ఆర్ట్స్ : సుమిత్ పటేల్, డాన్స్ : రాజ్ పైడి, ఫైట్స్ : నందు.