Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మాత ఎం.ఎస్.ఎన్ రెడ్డి సోదరుడి తనయుడు ఎం.ఎస్.రెడ్డి (బాబి రెడ్డి) ఫ్లోటింగ్ షర్పా ప్రొడక్షన్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'నాకౌట్'. మహీధర్ హీరోగా, ఉదరు కిరణ్ దర్శకుడుగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు గురువారం హైదరా బాద్‌లో ఘనంగా జరిగాయి. హీరో, హీరోయిన్ల పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు దర్శకుడు సాయి రాజేష్ క్లాప్ ఇచ్చారు. చిత్ర దర్శకుడు ఉదరు కిరణ్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా నిర్మాత ఎం.ఎస్.రెడ్డి (బాబి రెడ్డి)మాట్లాడుతూ,'బాక్సింగ్ నేపథ్యంలో ఉండే ఈ సినిమాలో 7 ఫైట్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మార్చి మొదటి వారం నుండి 60 రోజుల పాటు నిర్విరామంగా షూటింగ్ చేసి, సమ్మర్లో విడుదల చేస్తాం' అని చెప్పారు. 'ఓ బాక్సర్ తన జీవితంలో ఎదుర్కొనే సంఘటనలు నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామాగా, భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తాం. హైదరాబాద్ , వైజాక్, అరకు తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తాం' అని దర్శకుడు ఉదరు కిరణ్ చెప్పారు.