Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా నటిస్తున్న కామెడీ థ్రిల్లర్ 'సెబాస్టియన్ పి.సి.524'. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో జ్యోవిత సినిమాస్ పతాకంపై ప్రమోద్, రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా బాలాజీ సయ్యపురెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సిద్దారెడ్డి, జయచంద్రా రెడ్డి సహా నిర్మాతలు. నమ్రతా దారేకర్, కోమలి ప్రసాద్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో దర్శకుడు బాలాజీ సయ్యపురెడ్డి మాట్లాడుతూ,'సెబాస్టియన్' అనే కానిస్టేబుల్ తనకున్న నైట్ బ్లైండ్నెస్ ద్వారా ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడనేది ఈ సినిమా. మదనపల్లె రూరల్ బ్యాక్ డ్రాప్లో చేసిన ఈ సినిమా చాలా బాగా వచ్చింది. ఇందులో ఉన్న ప్రతి క్యారెక్టర్‌కు డార్క్ షెడ్ ఉంటుంది. కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎమోషన్, థ్రిల్లర్ ఇది. ఈ నెల 25న మా సినిమాని విడుదల చేస్తున్నాం' అని చెప్పారు. 'ఈ సినిమాను తెలుగు, తమిళంలో కూడా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. సెబాస్టియన్ క్యారెక్టర్ చాలా మందికి గుర్తుండిపోతుంది. ఈ క్యారెక్టర్‌ను ఛాలెంజ్‌గా తీసుకుని చేశా. ఈ సినిమా ప్రేక్షకులను 100% ఎంటర్టైన్ చేస్తుంది. ఈనెల 5న టీజర్ రిలీజ్ చేస్తున్నాం' అని హీరో కిరణ్ అబ్బవరం అన్నారు. 'మంచి కంటెంట్ ఉన్న కథతోపాటు నటీనటులు చక్కగా నటించిన ఈ సినిమా అందరినీ కచ్చితంగా అలరిస్తుంది' అని నిర్మాత నాగరాజు అన్నారు.
సహ నిర్మాత సిద్దారెడ్డి మాట్లాడుతూ, 'జ్యోవిత సినిమాస్ బ్యానర్ పై ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్లో మేం చేస్తున్న తొలి సినిమా ఇది. దర్శకుడు బాలాజీ చాలా చక్కగా తీశాడు. జిబ్రాన్ మ్యూజిక్ హైలెట్ అవుతుంది. సినిమా మొత్తం మదనపల్లిలో షూట్ చేశాం. మేం అనుకున్న దానికంటే మంచి అవుట్‌ఫుట్ వచ్చింది. ఈ నెల 25 విడుదలవుతున్న ఈచిత్రం అందర్నీ తప్పకుండా మెప్పిస్తుంది' అని చెప్పారు.