Authorization
Mon Jan 19, 2015 06:51 pm
90ల్లో పుట్టిన వారి అనుభవాలను తెలుపుతూ చేస్తున్న అడ్వెంచర్స్ చిత్రం ''కార్టూన్స్ 90' కిడ్స్ బే ఈడా''. దీపాల ఆర్ట్స్ పతాకంపై త్రిగుణ్, పాయల్ రాధాకష్ణ, దీపక్ సరోజ్, హర్ష నటీనటులుగా నటిస్తున్నారు. సాయి తేజ సప్పన్న దర్శకత్వంలో శ్రీకాంత్ దీపాల, సుధీర్ రెడ్డి తుమ్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి. హీరో, హీరోయిన్ల పై చిత్రీకరించిన తొలి షాట్‌కు హీరో సిద్ధు జొన్నలగడ్డ క్లాప్ ఇవ్వగా, నటుడు ఆకాష్ పూరి కెమెరా స్విచాన్ చేశారు. రామ్‌గోపాల్ వర్మ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సాయి తేజ సప్పన్న మాట్లాడుతూ,'ఒక ఫ్రెండ్ మరొక ఫ్రెండ్‌ను ఇగ్నోర్ చేస్తే, మిగిలిన ఫ్రెండ్స్ ఎలా రియాక్ట్ అవుతారు?, ఆ ఇగ్నోర్ చేసిన ఫ్రెండ్ ఎలా ఉంటున్నాడు అనేదే ఈ సినిమా. అలాగే 90ల్లో పుట్టిన వారి తీపి జ్జాపకాలు ఈ సినిమాలో కనిపిస్తాయి' అని చెప్పారు. 'అవుట్ అండ్ అవుట్ కామెడీ డ్రామాగా అందర్నీ అలరిస్తుంది' అని నిర్మాత శ్రీకాంత్ దీపాల తెలిపారు. హీరో త్రిగుణ్ మాట్లాడుతూ, ''కొండా' సినిమా తర్వాత ఆర్జీవీగారు మంచి సినిమాల్లో నటించమని సలహా ఇచ్చారు. ఈ కథ వినగానే నాకు కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే సినిమా ఇది. ఇలాంటి మంచి సినిమాలో నటిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది' అని చెప్పారు. 'దర్శకుడు నాకు కథను చెప్పినపుడు చాలా ఎగ్సైట్ అయ్యాను. ఈ రోజుల్లో స్నేహం ఎలాంటి స్థితిలో ఉందో అందరికీ తెలిసిందే. దీన్ని బేస్ చేసుకుని దర్శకుడు చాలా మంచి కథని తయారు చేశారు. మంచి టీమ్‌తో, మంచి కంటెంట్ ఉన్న సినిమాలో నటించే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నాను' అని కథానాయిక పాయల్ రాధాకృష్ణ అన్నారు.