Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్ బాబు, త్రివిక్రమ్ హ్యాట్రిక్ కాంబినేషన్లో రూపొందబోయే భారీ ప్రతిష్టాత్మక చిత్రం గురువారం ప్రారంభమైంది. శ్రీమతి మమత సమర్పణలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకష్ణ (చినబాబు) నిర్మిస్తున్న ఈ చిత్రం రామానాయుడు స్టూడియోలో ఉదయం 9 గంటల 53 నిమిషాలకు ఆత్మీయ అతిథుల సమక్షంలో పూజా కార్యక్రమాలతో వైభవంగా ఆరంభమైంది. చిత్ర కథానాయిక పూజ హెగ్డే పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ క్లాప్ ఇచ్చారు. ప్రముఖ పారిశ్రమికవేత్త సురేష్ చుక్కపల్లి కెమెరా స్విచాన్ చేశారు.
'మహేష్‌బాబు 28వ సినిమా తెరకెక్కబోయే ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మహేష్, త్రివిక్రమ్ కాంబలో వచ్చిన 'అతడు', 'ఖలేజా' చిత్రాలు దశాబ్ద కాలానికి పైగా ప్రేక్షకుల్ని, అభిమానుల్ని అలరిస్తూనే ఉన్నాయి. ఈ క్రేజీ కాంబినేషన్లో మరో బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ ప్రారంభమైందనే వార్త ఇటు ప్రేక్షకుల్లో, అటు అభిమానుల ఆనందాన్ని అంబరాన్ని తాకేలా చేసింది. 'మహర్షి' తర్వాత మహేష్, పూజా జోడీ నటిస్తోంది. రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్‌లో స్టార్ట్ చేస్తాం' అని నిర్మాత ఎస్.రాధాకష్ణ తెలిపారు.