Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హర్ష్ కనుమిల్లి, సిమ్రాన్ చౌదరి హీరో, హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'సెహరి'. జ్ఞానశేఖర్ ద్వారక దర్శకుడు. వర్గో పిక్చర్స్ పతాకంపై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించారు. హర్ష్ కనుమిల్లి కథ అందించిన ఈ చిత్రాన్ని ఈనెల 11న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు.
ఈ సందర్భంగా దర్శకుడు జ్ఞానశేఖర్ ద్వారక గురువారం మీడియాతో మాట్లాడుతూ, 'నేను గత ఆరేండ్ల నుంచి యాడ్ ఫిల్మ్ మేకింగ్‌లో ఉన్నా. ఇదే నా మొదటి చిత్రం. ఈ అనుభవం వల్లే ఈ సినిమాలో విజువల్స్ అద్భుతంగా వచ్చాయి. హీరో హర్ష అందించిన మంచి కథతో ఈ సినిమా తీశాం. యుక్త వయసులో అబ్బాయి మనస్తత్వం, ప్రేమ, బ్రేకప్ వంటి అంశాల మీద తెరకెక్కించాం. రెండున్నర గంటలు సినిమా అద్భుతంగా ఉంటుంది. సినిమా ప్రారంభమైన రెండు నిమిషాలకే 'సెహరి' ప్రపంచంలోకి వెళ్తారు. థియేటర్ల నుంచి బయటకు వచ్చేటప్పుడు అందరి ముఖాల పై చిరునవ్వు ఉంటుంది. అందుకే ఈ చిత్రానికి 'సెహరి' అని టైటిల్ పెట్టాం. 'సెహరి' అంటే పండగ అని అర్థం. ఓ సెలబ్రేషన్‌లా మా సినిమా ఉంటుంది. హర్ష్ పెద్ద స్టార్ అవుతాడు. ఆయన ఈజ్, టైమింగ్ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రశాంత్ విహారి ఇచ్చిన ఆల్బమ్ అద్భుతంగా వచ్చింది. కోటి గారిని తీసుకుందామని నిర్మాత అద్వయ ముందుకు వచ్చారు. ఆయనకి 20 నిమిషాలే కథ చెప్పాను. నచ్చడంతో ఆయన మా ప్రాజెక్ట్‌లోకి వచ్చారు. దీని తర్వాత హర్ష్‌తో కలిసి యాక్షన్ డ్రామా కథను తీయబోతున్నా' అని చెప్పారు.