Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుధాకర్ జంగం, లావణ్య హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'అం అః'. ఎ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ అనేది ట్యాగ్‌లైన్.
రంగస్థలం మూవీ మేకర్స్, శ్రీ పద్మ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై జోరిగె శ్రీనివాస్ రావు ఈ చిత్రాన్ని శ్యామ్ మండల దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల విడుదల చేసిన ఈ చిత్ర పోస్టర్‌తోపాటు 'నీ మనసే నాదని' వీడియో సాంగ్ హ్యుజ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చిత్ర టీజర్‌ని రిలీజ్ చేసి సినిమాపై మేకర్స్ మరింత ఆసక్తి పెంచేశారు. ఒక నిమిషం 12 సెకన్ల నిడివితో కట్ చేసిన ఈ టీజర్లో సస్పెన్స్‌తో కూడిన సన్నివేశాలు చూపించారు.
ఈ సందర్భంగా హీరో సుధాకర్ జంగం మాట్లాడుతూ, 'నేను చిరంజీవిగారి స్ఫూర్తితో సినిమాల్లోకి వచ్చాను. అందుకే ఆయన బెస్ట్ సినిమాలపై ఒక క్విజ్ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నాం. క్విజ్ విషయంలో మా దర్శక, నిర్మాతలు బాగా ఎంకరేజ్ చేశారు. ఈ ప్రోగ్రామ్‌ను హైదరాబాద్‌లో 1000 మంది పార్టిసిపెంట్స్‌తో ఈనెల 27న కండక్ట్ చేస్తున్నాం. ఇందులో మెగాస్టార్ 150 సినిమాలపై ఆరు రౌండ్స్‌లో ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో రౌండ్లో ఎలిమినేషన్ ఉంటుంది. గెలిచిన మొదటి ఐదుగురికి ప్రైజ్ మనీ ఇస్తాం. ఫస్ట్ ప్రైజ్‌గా 5 లక్షలు, సెకండ్ ప్రైజ్‌గా 1 లక్ష, థర్డ్ ప్రైజ్‌గా 50,000, ఫోర్త్ ప్రైజ్‌గా 30,000, ఫిఫ్త్ ప్రైజ్‌గా 20,000 రూపాయలను అందజేస్తాం' అని చెప్పారు.