Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడివి శేష్ మొదటి పాన్ ఇండియా సినిమా 'మేజర్' విడుదలకు సిద్ధమైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావచ్చాయి. శశి కిరణ్ తిక్క దర్వకత్వంలో రాబోతున్న ఈ సినిమాని తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించారు. మలయాళంలో కూడా దీన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఈ సినిమాని సరైన సమయంలో విడుదల చేస్తామని ఇటీవల కథానాయకుడు అడివి శేష్ సోషల్ మీడియా వేదికగా చెప్పారు. ఆ విధంగానే ఇప్పుడు ఈ చిత్రాన్ని వేసవి కానుకగా మే 27న విడుదల చేస్తున్నట్టు శుక్రవారం అధికారికంగా తెలిపారు. 'మేజర్ సందీప్ ఉన్నికష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో మేజర్ సందీప్ బాల్యం దగ్గర్నుంచి ముంబై అటాక్, మేజర్ వీర మరణం వంటి సన్నివేశాలన్నింటినీ వెండితెరపై ఆవిష్కరించ బోతున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా కచ్చితంగా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని మేకర్స్ వ్యక్తం చేస్తున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.