Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిగ్బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా నయా సినిమా వసంత పంచమి, ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మికంగా రామానుజ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న శుభగడియాల్లో ప్రారంభమైంది.
కాకతీయ ఇన్నోవేటివ్స్, దొండపాటి సినిమాస్ సంస్థలు సంయుక్తగా నిర్మిస్తున్న ఈ చిత్ర పూజ కార్యక్రమాలు యాదాద్రిలో వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో హీరో సొహైల్, నిర్మాతలు లక్ష్మణ్ మురారి, రమేష్ మాదాసు, వంశీ కష్ణ దొండపాటి, గవ రమేష్ రెడ్డి పాల్గొన్నారు. 'ఈ సినిమా కంటెంట్ ఓ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతుంది. దర్శకులే నిర్మాతలైతే కంటెంట్ పై ఎంత కసరత్తు జరుగుతుంది అనే దానికి నిదర్శనమే ఈ సినిమా' అని నిర్మాతలు చెప్పారు.