Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ మణికంఠ సినీ క్రియేషన్స్ పతాకంపై అభిజిత్ రామ్, శ్రీజ జంటగా రూపొందుతున్న చిత్రం 'గీత' (మన కష్ణగాడి ప్రేమకథ ట్యాగ్ లైన్). కిరణ్ తిమ్మల దర్శకత్వంలో రాము, మురళి, పరమేష్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. శనివారం ఫిలించాంబర్లో ఈ చిత్ర మోషన్ పోస్టర్ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. లవ్, కామెడీ, యాక్షన్ ఇలా.. ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. దర్శకుడు చెప్పిన దానికంటే అద్భుతంగా చిత్రీకరించాడు. సినిమా చాలా బాగా వచ్చింది' అని చెప్పారు. 'రేడియో మిర్చిలో ఆర్జేగా పని చేశా. మా నిర్మాతలు, దర్శకుడు ఒక మంచి కథతో సంప్రదించారు. కథ నచ్చడంతో వెంటనే ఈ సినిమా ప్రారంభించాం. శ్రీకాకుళం, పలాస, ఉద్దానం, వైజాగ్, ఒరిస్సా, హైదరాబాద్ ప్రాంతాల్లో చిత్రీకరణ చేశాం. మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నా' అని హీరో అభిజిత్ రామ్ అన్నారు.
దర్శకుడు కిరణ్ తిమ్మల మాట్లాడుతూ, 'హీరో, హీరోయిన్ల మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. మా నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా కథకు ఎంత ఖర్చు పెట్టాలో అంత పెట్టారు. విలేజ్ బ్యాక్ డ్రాప్లో జరిగే స్వచ్ఛమైన పేమకథా చిత్రమిది' అని అన్నారు.