Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వి.జె.సన్నీ, శ్రీ తేజ్, ఆషిమా నర్వాల్, తరుణీ సింగ్, నటీనటులుగా వెలిగొండ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సకల గుణాభి రామ'. ఇ.ఐ.పి.ఎల్. పతాకంపై సంజీవ రెడ్డి నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని, విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ వెస్టిన్ హౌటల్లో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని ఘనంగా నిర్వహించింది. సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్, దర్శకుడు నాగేశ్వర్‌రెడ్డి ఈ చిత్రంలోని పాటలను విడుదల చేయగా, దర్శకుడు అనిల్ రావిపూడి, హీరో విశ్వక్ సేన్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు వెలుగొండ శ్రీనివాస్ మాట్లాడుతూ, 'ఇదొక భార్యాభర్తల మధ్య జరగే లవ్ స్టోరీ. హీరో, హీరోయిన్స్ అద్భుతంగా నటించారు. డి.ఓ.పి నళిన్గారు నేను అనుకున్న దాని కంటే ఎక్కువ అవుట్‌ఫుట్ ఇచ్చారు. మా నిర్మాత ఎక్కడా రాజీపడలేదు. ఇందులోని పాటలు అద్భుతంగా వచ్చాయి. ఈ పాటల్లాగే సినిమా కూడా చాలా బాగుంటుంది' అని చెప్పారు.
'చాలా సినిమా ప్రయత్నాల తర్వాత 'కల్యాణ వైభోగమే' సీరియల్లో నటించే అవకాశం వచ్చింది. ఆ తర్వాత వెలిగొండ శ్రీనివాస్ గుర్తించి ఈ సినిమాలో హీరోగా నటించే ఛాన్స్ ఇచ్చారు. అనుదీప్ నాలుగు మంచి సాంగ్స్ ఇచ్చాడు. అమిత్ త్రివేది గారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా మాకోసం ''సైకో పిల్లా'' సాంగ్ పాడాడు. మా నిర్మాత నన్ను నమ్మి మంచి బడ్జెట్‌తో సినిమా తీసినందుకు ఆయనకు రుణపడి ఉంటాను' అని తెలిపారు.