Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అందరూ ముద్దుగా పిలుచుకునే లతా దీదీ తుది వీడ్కోలు పలకడంతో యావత్ భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటు అని, ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె పాటలు సజీవంగా ఉంటాయని పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఆమె మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని తెలిపారు.
భారత సినీ గానకోకిల, ది గ్రేటెస్ట్ లెజెండ్ లతా మంగేష్కర్ ఇక లేరు. నిజంగా ఇది గుండెబద్దలయ్యే వార్త. ఆవిడ లేని లోటు తీర్చలేనిది. ఆవిడ గానం సజీవం. సంగీతం ఉన్నంత వరకూ ఆ గాన మాధుర్యం ఎన్నటికీ నిలిచే ఉంటుంది. - చిరంజీవి
లతాజీ మరణం దేశానికే కాదు. సంగీత ప్రపంచానికే తీరని లోటు. ఆమె పొందని అవార్డు, రాని రివార్డు లేదు. విదేశాలు కూడా పురస్కారాలు ఆమెను గౌరవించాయి. - బాలకృష్ణ
గాన కోకిల చనిపోయారనే గుండెపగిలే వార్త తెలిసింది. ఎందరికో ఆమె స్ఫూర్తి. ఆవిడలేని లోటు ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. - వెంకటేష్
భారతీయ సినీ సంగీత లోకంలో ధ్రువతార గాన కోకిల లతా మంగేష్కర్ పాటకు భాషాబేధం లేదు. ఆ గళం నుంచి వచ్చిన ప్రతీ గీతం సంగీతాభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. - పవన్‌కళ్యాణ్
తరతరాలుగా భారతీయ సంగీతాన్ని నిర్వచించిన స్వరం ఆమెది. ఆ గాన సంపద నిజంగా అసమానమైనది. - మహేష్‌బాబు
లతా మంగేష్కర్ మృతి దేశానికి తీరని లోటు. ఆమె మధురగాత్ర మహారాణి. ఎంతో మంది కొత్తతరం గాయకులకు స్ఫూర్తి ప్రధాత. - ఎన్టీఆర్
ఇది విచారకరమైన రోజు. ఒక శకం ముగిసింది. లతాజీ తన పాటల ద్వారా ప్రేక్షకుల హదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. - అల్లు అర్జున్
లతాజీ ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచి ఉంటారు. భారతదేశపు నైటింగేల్‌కు నా హృదయపూర్వక నివాళి. - రాజమౌళి