Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కన్నడ దర్శకుడు హెచ్.ఎం.శ్రీనందన్ తెలుగులో 'లై లవర్స్'గా, కన్నడలో 'బీగ'గా ఓ ద్విభాషా చిత్రానికి దర్శకత్వం వహించారు. హెచ్.యమ్ మూవీ మేకర్స్, వి.యమ్.ఆర్ ప్రొడక్షన్లో జెడి.ఆకాష్, సెహర్ అప్సర్, సుమితా బజాజ్ నటిస్తున్నారు. రమేష్ రెడ్డి, చెక్జల నాగేశ్వర్ రెడ్డి సంయుక్తంగా ఈ ద్విభాషా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఈ సినిమా ఉంది.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ లాంచ్ వేడుకని ఘనంగా నిర్వహించింది. ముఖ్య అతిధులుగా విచ్చేసిన దర్శకుడు ఎ.ఎస్.రవి కుమార్ చౌదరి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయగా, దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి, వీరభద్రం చౌదరి టీజర్‌ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు హెచ్.ఎం.శ్రీనందన్ మాట్లాడుతూ, 'ఈ సినిమాని రెగ్యులర్ ఫార్మెట్లో చేయలేదు. భిన్న కాన్సెప్ట్‌తో చేశాం. నా మీద, కథ మీద నమ్మకంతో నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు' అని చెప్పారు. 'శ్రీనందన్ చెప్పిన కథ మాకు చాలా బాగా నచ్చింది. ఇప్పటివరకు కన్నడలో తను చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ సాధించాయి. భిన్న సైంటిఫిక్ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాలోని పాటలు చాలా బాగా వచ్చాయి. సినిమా అవుట్‌ఫుట్ కూడా అద్భుతంగా వచ్చింది. త్వరలోనే విడుదల చేస్తాం' అని నిర్మాతలు రమేష్‌రెడ్డి, చెక్కల నాగేశ్వర్‌రెడ్డి అన్నారు.