Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'1970-80ల్లో శోభన్‌బాబు, కష్ణ, కష్ణంరాజు, శ్రీదేవి, జయప్రద, రాధ వంటి స్టార్లు తమ నటన, స్టైల్‌తో యూత్‌ను ఊర్రూతలూగించారు. అప్పటి రెట్రో కాస్ట్యూమ్స్‌ను సెలెక్ట్ చేసుకుని, వారి పాత్రలలో నటిస్తూ, ఇప్పటి పరిస్థితులకు అద్దం పట్టే విధంగా తెరకెక్కిన సస్పెన్స్ కామెడీ డ్రామా '2020 గోల్ మాల్'.
కె.కె.చైతన్య సమర్పణలో బాబీ ఫిలిమ్స్ ప్రొడక్షన్ పతాకంపై మిట్ట కంటి రామ్, విజరు శంకర్, అక్షితా సోనవానె, మహి మల్హోత్రా, కిస్లే చౌదరీ హీరో, హీరోయిన్లుగా, జాన్ జక్కిని దర్శకుడిగా పరిచయం చేస్తూ కె.కె.చైతన్య నిర్మించారు. ఈ నెల 18న ఈ సినిమాని విడుదల చేస్తున్న సందర్భంగా సోమవారం ఫిల్మ్ ఛాంబర్లో చిత్ర యూనిట్ ఆడియో వేడుకని ఘనంగా జరిపింది.
ఈ సందర్భంగా దర్శకుడు జాన్ జక్కి మాట్లాడుతూ, 'గతంలో కోల్పోయిన ప్రేమ తాలూకా జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటే జరిగే పరిణామాల నేపథ్యంలో జరిగే కథ. ఇందులో అందరూ రెట్రో లుక్‌లో కనిపిస్తారు. కనిష్క అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. కొత్త కంటెంట్‌తో వస్తున్న సస్పెన్స్ కామెడీ డ్రామా ఇది. ఇలాంటి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతకి కృతజ్ఞతలు' అని చెప్పారు. 'అర్థం కాని విషయాలు, ఏం జరుగుతుందో తెలియనప్పుడు మనం 'గోల్ మాల్' అంటార. ఇలాంటి విషయాలు ఇందులో చాలా ఉంటాయి. ఒక పల్లెటూరులో జరిగే స్టోరీ ఇది. కథని ఆసక్తిగా చెప్పడం కోసం రెట్రో స్టైల్‌ను ఎంచుకున్నాం' అని హీరో మిట్టకంటి రామ్ తెలిపారు.