Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సై-ఫై కథలతో ప్రేక్షకుల్ని మెప్పించడంలో దర్శకుడు రోనాల్డ్ ఎమ్మీరిచ్ సిద్ధహస్తుడు. తాజాగా ఆయన 'మూన్ఫాల్' అనే కొత్త సినిమాతో మన దేశ ప్రేక్షకుల్ని అలరించబోతున్నారు. ఓ అతీత శక్తి వల్ల చంద్ర గ్రహంలో ఊహించని మార్పు ఏర్పడి, కక్ష్యని మారడం వల్ల భూ గ్రహాన్ని, అలాగే భూమిపై ఉన్న మానవ జాతి నాశనం అవుతుందనే విషయాన్ని నాసాలో పని చేసే ఓ సైంటిస్ట్ తెలుసుకుంటుంది. ఈ భయంకర ప్రమాదాన్ని నివరించడం కోసం అత్యంత ప్రతిభావంతులైన తన ఇద్దరి స్నేహితులతో ఏం చేసింది? అనేదే ఈ సినిమా. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ చిత్రాన్ని ఇంగ్లీష్, తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఈనెల 11న విడుదల చేస్తున్నారు. దాదాపు 146 మిలియన్ డాలర్ల భారీ వ్యయంతో నిర్మించిన ఈ చిత్రంలో హల్లె బెర్రి, ప్యాట్రిక్ విల్సన్, జాన్ బ్రాడ్లీ, మైఖేల్ పెనా తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు.