Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాజీవ్ సాలూరి, దీప ప్రధాన పాత్రల్లో ఈ నెల 11న 'ఆఖరి ముద్దు' చిత్రాన్ని ప్రారంభిస్తున్నారు. సీవీ ఆర్ట్స్ పై ఈ సినిమాని సి.వి.రెడ్డి నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్నారు. 'పెళ్లి గోల, విజయరామరాజు, శ్వేత నాగు, ఆడుతూ పడుతూ' లాంటి సూపర్ హిట్ చిత్రాలను సి.వి.రెడ్డి నిర్మించారు.
దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆయన 'బదిలి' చిత్రానికి నంది అవార్డు అందుకున్నారు. నేషనల్ ఫిలిం అవార్డ్స్, ఇండియన్ పనోరమా, ఆస్కార్ కమిటీకి చైర్మన్గా సేవలందించారు. అందర్నీ ఆలోచింపజేసే కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలను కూడా ఆయనే అందిస్తున్నారు. సీత కాకరాల, పవిత్ర లోకేష్, పోసాని తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి డి ఓ పి: ఆండ్ర బాబు, మ్యూజిక్: కోటి, ఆర్ట్ డైరెక్టర్: మౌళి, ఎడిటర్: ప్రవీణ్ పూడి.