Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ, రమేష్ వర్మ కాంబోలో రూపొందుతున్న చిత్రం 'ఖిలాడీ'. డింపుల్ హయతి, మీనాక్షి చౌదరిలు హీరోయిన్లు. పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ పతాకాలపై ఈ చిత్రాన్ని సత్య నారాయణ కోనేరు నిర్మించారు. హవీష్ ప్రొడక్షన్‌పై తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 11న తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలకానుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సత్యనారాయణ కోనేరు మీడియాతో ముచ్చటించారు.
'నేను కథను నమ్ముతాను. 'రాక్షసుడు' సినిమా కథ నమ్మాను. అది హిట్ అయింది. దర్శకుడు రమేష్ వర్మ చెప్పిన ఈ కథ కూడా చాలా బాగుంది. మీ కెరీర్లో హయ్యస్ట్ కలెక్ట్ చేయాలని ఈ సినిమా చేస్తున్నానని రవితేజ గారితో చెబితే, ఆయన హ్యాపీగా ఫీలయ్యారు. రైటర్ శ్రీకాంత్‌తో రాయించిన డైలాగ్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి. రెగ్యులర్ కమర్షియల్ సినిమానే అయినా ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ చిత్రమిది. ఇలాంటి పాయింట్‌తో ఇంత వరకు ఏ సినిమా రాలేదు. కొత్త పాయింట్‌తో రాబోతున్నాం. బాలీవుడ్ సినిమాలా ఉంటుంది. ఇటలీలో కొన్ని షాట్లు తీశాం. వాటిని చూస్తే హాలీవుడ్ రేంజ్లో అనిపిస్తుంది. అలాగే సినిమా ఎంతో స్టైలీష్‌గా ఉంటుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా రిచ్‌గా ఉంటాయి. దేవీ శ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇప్పటి వరకు విడుదల చేసిన ఐదు పాటలు హిట్ అయ్యాయి. హీరోయిన్లు కూడా చక్కగా నటించారు. రమేష్ వర్మ ఈ సినిమా నాకు చూపించారు. నాకెంతో బాగా నచ్చింది. అందుకే ఆయనకు కారు బహుమతిగా ఇచ్చాను. ఈ కథను ఆల్ ఇండియా లెవెల్లో తీసుకెళ్దామని పెన్ స్టూడియోస్‌తో కలిశాం. ఈ సినిమాను హిందీలో కూడా విడుదల చేస్తున్నాం. ఈనెల 11న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, హిందీ భాషల్లో మా చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాం. 'పెళ్లి చూపులు' సినిమాని తమిళంలో రీమేక్ చేస్తే, హిట్ అయింది. 'రాక్షసుడు' సినిమాని కూడా రీమేక్ చేస్తే, అది కూడా విజయం సాధించింది. ఈ సినిమా కూడా కచ్చితంగా హిట్ అవుతుంది.
ఇతర వ్యాపారాలు, విద్యా సంస్థలు ఉన్నప్పటికీ హవీష్ కోసమే సినిమా పరిశ్రమలోకి వచ్చాను. హవీష్ ప్రస్తుతం 'సంజరు రామస్వామి' సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత ఏ స్టూడియోస్‌పై ఓ సినిమా చేస్తున్నాం. 'రాక్షసుడు 2' కూడా ప్లాన్ చేస్తున్నాం. వంద కోట్ల 'యోధ' అనే పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాం' అని సత్యనారాయణ కోనేరు చెప్పారు.