Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విష్ణు విశాల్ హీరోగా రూపొందిన డార్క్ యాక్షన్ థ్రిల్లర్ 'ఎఫ్ఐఆర్'. మను ఆనంద్ దర్శకుడు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఈనెల 11న ఒకేసారి విడుదల కానుంది. అగ్ర హీరో రవితేజ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో వీడియో సందేశం ద్వారా రవితేజ మాట్లాడుతూ, 'ఆరు నెలల క్రితం ఈ సినిమా చూశా. నాకు చాలా నచ్చింది. డిఫరెంట్ కంటెంట్ సినిమా. ఇలాంటి చిత్రం చేయాలని నాకూ ఉంది. విష్ణు విశాల్‌కు ఆల్ ది బెస్ట్' అని అన్నారు.
'డైరెక్ట్ తెలుగు సినిమాని త్వరలోనే చేస్తాను. రవితేజ గారు లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు. ఆయన మా సినిమా చూసి మెచ్చుకున్నారు. ప్రెజెంట్ చేసేందుకు రెడీ అయ్యారు. మను అద్భుతమైన డైలాగ్స్ రాశారు. మంజిమా, మోనిక అద్భుతంగా నటించారు. నీలో ఉన్న హీరోను ప్రేక్షకులు చూడాలి. దాన్ని నువ్వు ఇంకా బయటకు తీసుకురావడం లేదని ఇందులో నటించిన గౌతమ్ మీనన్ సర్ అన్నారు. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేయకపోతే నీతో మాట్లాడనని గుత్తా జ్వాలా అంది' అని విష్ణు విశాల్ చెప్పారు.
డైరెక్టర్ మను ఆనంద్ మాట్లాడుతూ, 'ఈనెల 11న మా సినిమాని థియేటర్లో చూసి, సరికొత్త అనుభూతి పొందండి' అని అన్నారు.