Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయి ధన్సిక ప్రధాన పాత్రలో తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కె.వి.ధీరజ్, నవకాంత్ను హీరోలుగా పరిచయం అవుతూ రూపొందుతున్న చిత్రం 'షికారు'. శ్రీమతి వాగేశ్వరి(పద్మ) సమర్పణలో శ్రీ సాయి లక్ష్మి క్రియేషన్స్ పతాకంపై పి.ఎస్.ఆర్ కుమార్ (వైజాగ్ బాబ్జి) నిర్మిస్తున్నారు.
హరి కొలగాని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం నుంచి సిద్ శ్రీరామ్ ఆలపించిన 'మనసు దారి తప్పెనే..' పాటను యువ కథానాయకుడు వరుణ్ తేజ్ రిలీజ్ చేశారు. ''మనసు దారి తప్పెనే వయసు గోడ దూకెనే..' అంటూ సాగే పల్లవిగల ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యం అందించగా, సిద్ శ్రీరామ్ తన వాయిస్‌లోని మ్యాజిక్‌ను మరోసారి రిపీట్ చేశారు. శేఖర్ చంద్ర బాణీలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. మంచి కంటెంట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం తప్పకుండా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది' అని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కో-ప్రొడ్యూసర్: సాయి పవన్ కుమార్, డిఓపి: వసిలి శ్యామ్ ప్రసాద్, మ్యూజిక్ : శేఖర్ చంద్ర, డైలాగ్స్: విశ్వ కరుణ్, ఆర్ట్ డెరెక్టర్: షర్మిల ఎలిశెట్టి, ఎడిటర్: వెంకటేశ్వరరావు శంగవరపు, లిరిక్స్: భాస్కర్ భట్ల, కొరియోగ్రాఫర్: సుభాష్ సారికొండ, యాక్షన్: రొబ్బిన్ సుబ్బు, లైన్ ప్రొడ్యూసర్: వెంకటేష్ ఎస్.కె.కులపాక, ప్రొడ్యూసర్: పి.ఎస్.ఆర్ కుమార్ (బాబ్జి, వైజాగ్), స్టోరీ -స్క్రీన్ ప్లే -డైరెక్షన్ : హరి కొలగాని.