Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తమిళ స్టార్ హీరో విష్ణు విశాల్ నటించిన డార్క్ యాక్షన్ థ్రిల్లర్ 'ఎఫ్ఐఆర్'. ఈ చిత్రానికి మను ఆనంద్ దర్శకత్వం వహించారు. విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్ పై విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఈనెల 11న విడుదల కానుంది. అగ్ర కథానాయకుడు రవితేజ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మను ఆనంద్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, 'నేను ఆస్ట్రేలియాలో మల్టీనేషనల్ కంపెనీలో పనిచేశాను. సినిమాలపై ఆసక్తితో 2011లో ఇండియా వచ్చా. గౌతమ్ వాసుదేవ్ మీనన్‌గారి దగ్గర 8 ఏండ్లు పని చేశా. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ చిత్రం. ఓ ముస్లిమ్ కుర్రాడు టెర్రరిజంలో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఏమైంది అనేదే కథ. విష్ణు విశాల్ నటించిన 'రాక్షసన్' సినిమా చూసి, ఈ కథకు తనే పర్ఫెక్ట్ అని ఫిక్స్ అయ్యాను. ఇందులో ఆయన క్యారెక్టర్లో రెండు షేడ్స్ ఉంటాయి.
ఈ సినిమాలో ఎటువంటి కాంట్రవర్సీలను టచ్ చేయలేదు. ఒక ముస్లిం కుర్రాడు ప్రపంచాన్ని ఏ కోణంలో చూస్తాడు అనేది మాత్రమే చూపించాను. హ్యూమన్ రిలేషన్స్, డ్రామా, డైలాగ్స్ అందర్నీ అలరిస్తాయి. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు. వీళ్ళు కథకు చాలా కీలకం. స్టన్ శివ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు. ఇందులో ఐదు పాటలున్నాయి. అవి కూడా కథని రన్ చేస్తాయి. పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని అశ్వత్ అద్భుతంగా ఇచ్చాడు. విష్ణు భార్య జ్వాలా గుత్తాకి రవితేజ క్లోజ్ ఫ్రెండ్. అందుకే ఈ సినిమా పూర్తయ్యాక ఆయనకు ట్రైలర్ చూపించార. అది నచ్చి, మొత్తం సినిమా చూశారు. సినిమా చాలా బాగుంది, తప్పకుండా హెల్ఫ్ చేస్తానని చెప్పారు. దాని ఫలితమే ఆయన సమర్పణలో తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. ప్రస్తుతం ఆయన నటించిన 'ఖిలాడి' భారీ అంచనాలతో వస్తోంది. ఫ్యాన్స్ చూస్తారు. అలాగే రవితేజ సమర్పకులుగా ఉన్నారనే ఆసక్తితో మా సినిమానూ ప్రేక్షకులు, ఫ్యాన్స్ కూడా చూస్తారనే నమ్మకం ఉంది' అని తెలిపారు.