Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రతి ఏటా ఊరిస్తున్న ఆస్కార్ ఈసారి కూడా భారతీయ సినిమాకి అందని ద్రాక్షే అవ్వడం బాధాకరం. ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో ఈ ఏడాది మోహన్‌లాల్ 'మరక్కర్', సూర్య 'జైభీమ్' చిత్రాలు ఎంపికయ్యాయి. అయితే మంగళవారం ఆస్కార్ కమిటీ ప్రకటించిన తుది నామినేషన్ల జాబితాలో ఈ రెండింటికీ చోటు దక్కలేదు. 'రైటింగ్ విత్ ఫైర్' అనే భారతీయ డాక్యుమెంటరీ నామినేషన్లలో స్థానం సొంతం చేసుకుని కొంత ఊరటనివ్వడం విశేషం.'బెల్ఫాస్ట్', 'కోడా', 'డోన్ట్ లుక్అప్', 'డ్రైవ్ మై కార్' వంటి తదితర చిత్రాలు ఉత్తమ సినిమా విభాగంలో పోటీ పడుతుండగా, జేవియర్ బార్డెమ్, బెనిడిక్ట్ కంబర్ బ్యాచ్, ఆండ్రూ గార్ఫీల్డ్, విల్‌స్మిత్, డేంజిల్ వాషింగ్టన్, జెస్సికా చాస్టెయిన్, ఒలివియా కోల్మెన్, ఫెనోలోప్క్రజ్, నికోల్ కిడ్మన్, కిరెస్టెన్ స్టీవార్ట్ తదితరులు ఉత్తమ నాయకానాయికల విభాగంలో అమీతుమీ తేల్చుకోబోతున్నారు. మార్చి 27న 94వ అకాడమీ అవార్డుల ప్రధానోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు.