Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ, రమేష్ వర్మ కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'ఖిలాడి'. కోనేరు సత్య నారాయణ నిర్మాత. బాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. హవీష్ ప్రొడక్షన్‌పై తెరకెక్కిన ఈ చిత్రంలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. ఈ సినిమా ఈనెల 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నాయికలు మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి మంగళవారం మీడియాలో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
మీనాక్షి చౌదరి మాట్లాడుతూ, 'రవితేజ సినిమా అనగానే మరో సెకండ్ థాట్ లేకుండా అంగీకరించాను. ఆయన కామెడీ టైమింగ్ ఫర్ఫెక్ట్గా ఉంటుంది. నేను ఏ సినిమా చేసినా పాత్ర నిడివి ఎంత అనేది చూడను. కథలో భాగంగా నా క్యారెక్టర్‌కి ఉన్న ప్రాధాన్యత చూస్తాను. నా రెండో సినిమాకే ఇలాంటి పెద్ద సినిమా రావడం గ్రేట్. రవితేజ సినిమాల్లో కథకు రిలేటెడ్‌గా నాయికల పాత్రలుంటాయి. అలాగే ఈ సినిమాలోనూ ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే హీరోయిన్ల స్థాయిని పెంచే పాత్రలు చేశాం' అని చెప్పారు.
మరో నాయిక డింపుల్ హయాతి మాట్లాడుతూ, 'నాకు కథ చెప్పినప్పుడు రవితేజతోపాటు సమానంగా నా పాత్ర ఉంటుందని తెలిసి, టెన్షన్ పడ్డాను. ఎందుకంటే ఆయనంత స్పీడ్‌గా యాక్ట్ చేయటం మాలాంటి వారికి చాలాకష్టం. 'గద్దలకొండ గణేష్' చిత్రంలో స్పెషల్ సాంగ్ చేస్తే, ఇకపై కూడా అలాంటివే వస్తాయని అందరూ అన్నారు. వాళ్ళు చెప్పినట్టే పలు సినిమాలలో అలాంటి ఆఫర్లే వచ్చాయి. అయితే నటిగా నిరూపించుకోవాలని మంచి సినిమా కోసం వెయిట్ చేశాను. లక్కీగా ఈ సినిమాలో అవకాశం వచ్చింది. ఇందులో నేను మూడు డిఫరెంట్ సాంగ్స్ చేశాను. ఇప్పటికే పాటలు విడుదలై సినిమాపై అంచనాలు పెంచాయి. అలాగే టీజర్, ట్రైలర్.. ఇవన్నీ రవితేజగారి ఫ్యాన్స్, ప్రేక్షకుల్లోనూ అమితాసక్తిని పెంచాయి. దీంతో భారీ అంచనాలతో ఈ సినిమా విడుదలవుతోంది. ప్రస్తుతం స్పెషల్ సాంగ్స్ చేయటం లేదు. భవిష్యత్‌లో అలాంటి ఆఫర్లు వస్తే ఆలోచిస్తాను' అని అన్నారు.