Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: 2021వ ఏడాది మార్పుకు దారి తీసిన ఏడాది కాగా, బాలలకు అలాగే మాకు అత్యంత హెచ్చుతగ్గులను చూసిన సమయంగా ఉంది. అదేమైనప్పటికీ ఈ సవాళ్ల మధ్య కూడా నికలోడియాన్ బాలల్ని ముందంజలో నిలిపే భరోసాకు కట్టుబడి ఉంది మరియు బాలలు ఉత్సాహంలో ఉండేందుకు స్వేచ్ఛగా అభివ్యక్తీకరించేందుకు ఉత్తేజిస్తోంది. ప్రతి ధ్వని కూడా ముఖ్యమైనదేనన్న నమ్మకానికి ‘నికలోడియన్ కిడ్స్ ఛాయిస్ అవార్డ్స్ 2021’ ద్వారా సిద్ధం చేసేందుకు మరియు మనోరంజన అందించేందుకు ముందుకు వస్తోంది. కిడ్స్ ఛాయిస్ అవార్డ్స్ 2020 తన వర్చువల్ అవతారంలో గతంలో కన్నా అభూతపూర్వమైన విజయాన్ని దక్కించుకోగా 1.5 మిలియన్ల ఓట్లను అందుకుంది. ఈ ఏడాది కూడా ఈ పురస్కారాలకు పలు అత్యాధునిక చేరికలు, ఆవిష్కరణలతో జీవితాన్ని వర్చువల్‌కు తీసుకు రాగా తప్పనిసరిగా, బాలలు అలాగే తల్లిదండ్రుల మనస్సు గెలుచుకుంటుంది.
నికలోడియన్ కిడ్స్ ఛాయిస్ అవార్డ్స్ స్థిరంగా, విజయవంతంగా బాలల విభాగంలో అత్యంత గమనార్హమైన బ్రాండ్ ఐపిలలో ఒకటిగా వృద్ధి చెందింది. ఫేవరెట్ యూట్యూబర్, ఫేవరెట్ డ్యాన్సర్, ఫేవరెట్ మొబైల్ గేమ్ తదితర ప్రస్తుత విభాగాలతో నికలోడియన్ కేసీఏ 2021 సరికొత్త, ప్రస్తుత విభాగాలైన ఫేవరెట్ ఎన్విరాన్మెంటలిస్ట్, ఫేవరెట్ సిబ్లింగ్ జోడీ మరియు ఫేవరెట్ ఫ్యాషన్ ఐకాన్ తదితర విభాగాలను పరిచయం చేసింది. ఇవే కాకుండా దేశ వ్యాప్తంగా ప్రతిభలకు గుర్తించి, పురస్కరాలను అందించేందుకు కేసీఏ 2021 దక్షిణాదికి ప్రాధాన్యత ఇచ్చిన విభాగాలనూ పరిచయం చేస్తోంది. ప్రతి ఏడాది తరహాలోనే విజేతలు ఇంటికి నికలోడియన్ బ్లింప్ తీసుకుని వెళ్లవచ్చు మరియు గౌరవపు గుర్తునూ పొందుతారు! అందరి శక్తులను ఉన్నత స్థాయికి తోడ్కొనివెళ్లే ఆరెంజ్ కార్పెట్‌లో షారూఖ్ ఖాన్, దీపికా పదుకొణె, ఆలియా భట్, రణ్వీర్ సింగ్ తదితర తారాగణంతో సహా వివిధ విభాగాల్లో పలువురు ప్రముఖ వ్యక్తులు ఈ అత్యంత నిరీక్షణల బ్లింప్ను ముందుకు తోడ్కొనివెళ్లనున్నారు.
లాక్డౌన్ సందర్భంలో వారు ఇంటీరియర్‌లో ఉన్నప్పుడు బాలలకు ఫేవరెట్ ఎవరు? ఏమిటి? అనేదాని గురించి నిర్వహించిన పరిశోధన అధ్యయనం ద్వారా నామినేట్ చేశారు. ఓటింగ్ చేసే అవకాశాలను మరింత విస్తరించగా, ప్రతి బిడ్డకూ వారి స్వరాన్ని అభివ్యక్తీకరించే అవకాశాన్ని ఇస్తోంది. వారి ఎంపికల అభిప్రాయపు స్వరాన్ని, విస్తృత స్థాయిలో ప్రేక్షకులకు అందించేందుకు కేసీఏ 2021 వూట్, వూట్ కిడ్స్ మరియు జియో యాప్ తదితర పలు ప్లాట్‌ఫారాల ద్వారా ఓటింగ్ ప్రధాన ద్వారాలను తెరచింది.
కిడ్స్ ఛాయిస్ అవార్డ్స్ 2021 గురించి వయాకాం 18 హిందీ మాస్ ఎంటర్టెయిన్మెంట్ అండ్ కిడ్స్ టీవీ నెట్వర్కు ప్రధాన అధికారిణి నీనా జైపురియా మాట్లాడుతూ, ‘‘మేము చేసే ప్రతి ఒక పనిలో బాలలు ఉండగా, నికలోడియన్లో మేము ఈ కఠిన సమయాల్లో మా యువ, క్రియాశీలకమైన వీక్షకులకు చురుకుగా, మనోరంజన అందిస్తూ, ఉత్తేజించడాన్ని కొనసాగిస్తున్నాము. నికలోడియన్ బాలల విభాగానికి అర్థవంతమైన, అత్యంత నిరీక్షణల కేంద్రంగా న్యూ నార్మల్ను అలవర్చుకుంది’’ అని తెలిపారు.
దీని గురించి మరింత మాట్లాడుతూ, ‘‘ఏడాది నుంచి ఏడాదికి కిడ్స్ ఛాయిస్ అవార్డ్స్ బాలల మనోరంజన ప్రకారం విశిష్ఠ బ్రాండ్ ఐపీగా వృద్ధి చెందింది. యువ మనస్సులు మా భావిష్యత్తు అని విశ్వసిస్తున్నాము మరియు వారి వారి ఎంపికలను అత్యంత ప్రాముఖ్యతతో తెలియజేసేందుకు సిద్ధం చేస్తున్నాము. నికలోడియన్ కేసీఏ 2021 ఎడిషన్ వినోదం, ఆవిష్కారాత్మక కార్యక్రమం అని భరోసా ఇస్తుండగా, అందులో ఆసక్తిదాయకమైన విభాగాలు మరియు ప్రత్యేక వర్చువల్ అనుభవాలు మరియు కమ్యూనికేషన్లు ఉన్నాయి’’ అని వివరించారు.
నికలోడియన్ కిడ్స్ ఛాయిస్ అవార్డ్స్ 2021 కోసం అన్ని ప్రయత్నాలనూ చేయగా, ఆవిష్కారాత్మక మరియు సదృఢమైన మార్కెటింగ్ క్యాంపెయిన్‌ను నిర్వహించనుంది. ఫ్రాంఛాయిసీల్లో ఆన్ ఎయిర్ ఉత్తేజనాలే కాకుండా, ఈ కార్యక్రమం విశిష్ఠ, ప్లాట్ఫారం ఆధారిత క్రియాశీలతలను ఇన్స్టాగ్రాం, యూట్యూబ్, ఫేస్బుక్, ట్విటర్, ఎంఎక్స్ టకాటక్ తదితరాలు ఉన్నాయి. ప్రత్యేకంగా రూపొందించిన సూపర్ ఫ్యాన్ పోటీలు, కార్యక్రమాలు బాలలకు మనోరంజన అందిస్తాయి. కేసీఏ గ్యాంగ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ పూర్తి శక్తితో అభిమానులకు విలక్షణమైన మనోరంజనను సృష్టించనుంది. మొత్తం మీద మార్కెటింగ్ క్యాంపెయిన్‌ను మరో అడుగు ముందుకు తీసుకు వెళ్లి నికలోడియన్ కేసీఏ 2021కు ప్రత్యేక కాంబోలను రూపొందించేందుకు 99 ప్యాన్కేక్స్తో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది.
బాలలు వారి ఎంపికలకు స్వరాన్ని అందించేందుకు సిద్ధం చేయగా, నికలోడియన్ బ్లింప్ ఇంటికి తీసుకు వెళ్లేందుకు ఎవరిని ఎవరు ఎంపిక చేస్తారో తెలుసుకునేందుకు సిద్ధంకండి.
ఫిబ్రవరి 7, 2022 నుంచి ఓట్లు వేయడాన్ని ప్రారంభించండి. నికలోడియన్ కిడ్స్ ఛాయిస్ అవార్డ్స్ 2021 పురస్కారాల విభాగాల వివరాలు ఇక్కడ ఉన్నాయి: